సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇంకా అందరిని కలిచివేస్తుంది. అభిమానులెవ్వరు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లోని నీచ రాజకీయాలు, బంధు ప్రీతే సుశాంత్ ను బలిగొన్నాయని బాలీవుడ్ ప్రముఖులపైనా కూడా కేసులు నమోదవుతున్నాయి. 

ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమాని అతడి మరణాన్ని జీర్ణం చేసుకోలేక అతడి వీడియోలను చూస్తూ డిప్రెషన్ లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. 

వివరాల్లోకి వెళితే... విశాఖ జిల్లా మల్కాపురంలో పరిధిలోని శ్రీహరిపురం పవన్‌ పుత్ర నగర్ లో  శుక్రవారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన సుమన కుమారి కి టిక్‌ టాక్‌ వీడియోలు చూడడం బాగా అలవాటు. ఆ అలవాటే ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయింది. 

అలవాటులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుషాంత్‌ సింగ్‌ మరణానికి సంబంధించి వీడియోలను టిక్‌ టాక్‌లో తరచూ చూస్తుండేది. దాంతో ఆమె తీవ్ర కృంగుబాటుకు లోనైది. ఆ కృంగుబాటు డిప్రెషన్ కి దారితీసి సుమన‌ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇకపోతే... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నుంచి బాలీవుడ్‌ సినీ పరిశ్రమ కోలుకోలేకపోతోంది. షాక్ నుంచి తేరుకున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. అయితే  ఈలోగా నెటిజెన్లు కొంత మంది బాలీవుడ్‌ ప్రముఖులను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల కృతి సనన్‌ను ఇలాగే ట్రోల్ చేశారు నెటిజెన్లు, తరువాత ఆమె తన బాధను వ్యక్తపరచటంతో పాటు నెటిజెన్లపై కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాజాగా బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విద్యుత్‌ జమ్వాల్‌ను కూడా అలాగే ట్రోల్‌ చేస్తున్నారు.

సుశాంత్ చనిపోయిన తరువాత విద్యుత్‌ స్పందించలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ జమ్వాల్‌ స్పదించాడు. ఓ వ్యక్తి `హేయ్ విద్యుత్‌, సుశాంత్‌ గురించి స్పందించలేదేంటి` అంటూ చేసిన కామెంట్‌పై యాక్షన్ స్టార్ స్పందించాడు. `నువ్వు వినగలిగితే నిశ్శబ్దం కూడా ఎంతో మాట్లాడుతుంది. కనీరు కూడా రాకపోవటం, స్పందించడానికి మాటలు కూడా లేకపోవటం, పదే పదే తలుచుకోవటం కూడా ఆవేదనను వ్యక్త పరిచే మార్గమే. చనిపోయిన వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులకు చూడనప్పుడు ఎవరికోసం ట్వీట్లు చేయటం?  అందరూ స్పందిస్తారు. నేను మౌనంగా స్పందిస్తా` అంటూ కామెంట్ చేశాడు విద్యుత్‌ జమ్వాల్‌.

ఈ నెల 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అభిమానులతో సినీ, రాజకీయా, క్రీడా ప్రముఖులు సుశాంత్ మృతికి సంతాపం తెలియజేశారు. అయితే సుశాంత్‌ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ సినీ పెద్దలు ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది సినీ ప్రముకలు మానసికంగా వేదించిన కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది.