వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేఏ పాల్ ఏపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తానే గెలుస్తానంటూ ఆయన ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. దీనిపై  రామ్ గోపాల్ వర్మ గత కొంత కాలంగా సెటైరికల్ గా ట్వీట్లు చేస్తున్నారు.

 ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాను కూడా తమ పార్టీలోకి ఆహ్వానించారు పాల్. తమ ప్రభుత్వం వచ్చాక ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. 

డొనాల్డ్ ట్రంప్, జార్జ్ బుష్‌‌తో పాటు ఎంతో మంది దేశాధ్యక్షులు తన వల్లే గెలిచారంటూ గొప్పలు చెప్పడం కేఏ పాల్ మరో సంచలనం. తాను ప్రార్థన చేయడం వల్లే అమితాబ్ బచ్చన్ లాంటి వారు ప్రాణాలతో ఉన్నారని పాల్ చెప్పారు. ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెంచుతూ హిందూపురంలో బాలక్రిష్ణపై తమ పార్టీ తరుపున యాంకర్ శ్వేతా రెడ్డిని ప్రకటించారు. 

కేఏ పాల్ చర్యలను మొదటి నుంచీ గమనిస్తూ వస్తున్న వర్మ.. తాజాగా ఆయనకి మరో కౌంటర్ ఇచ్చారు. ఈ వచ్చే ఎన్నికల్లో పాల్ కి ఒక్క ఓటు కూడా రాదని.. వర్మ ట్వీట్ చేశారు. ఈ విషయం తనకు జీసస్ చెప్పాడని.. ఆయన అన్నారు. పాల్ కూడా తన ఓటు తనకు వేసుకోడని వర్మ ఎద్దేవా చేశారు.