లోకేశ్‌.. నిన్ను చూసి జాలి పడాలా? నవ్వాలా?.. ఇది కూడా తెలియకుంటే ఎలా బేబీ: ఆర్జీవీ స్ట్రాంగ్ రిప్లై

నారా లోకేశ్ చేసిన కామెంట్లపై ఫిలిం డైరెక్టర్ ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. నారా లోకేశ్‌ను బేబీ అని సంబోధిస్తూ విమర్శలు చేశారు. తనను చూసి జాలి పడాలా? నవ్వాలా? అర్థం కావడం లేదని, తనను విమర్శించే సబ్జెక్ట్ కూడా నారా లోకేశ్‌కు లేకపోతే ఆయన తండ్రిని ఆ దేవుడు కూడా కాపాడలేడని పేర్కొన్నారు.
 

RGV counters nara lokesh over his criticism on x platform kms

హైదరాబాద్: ఫిలిం డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నారా లోకేశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్‌ను బేబీ అని సంబోధిస్తూ ఈ మాత్రం కూడా సబ్జెక్ట్ మ్యాటర్ తెలియకుంటే ఎలా? అంటూ చురకలు అంటించారు. తనను ఎలా విమర్శించాలో కూడా ట్యూషన్ చెప్పారు. అంతేకాదు, తన లాంటి వారినీ సరిగ్గా విమర్శించడం చేతగాక పోతే ఆయన తండ్రిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ కామెంట్లు చేశారు.

నారా లోకేశ్ ఎక్స్ అకౌంట్‌లో ఆర్జీవీపై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని పోస్టు చేశారు. రాంగోపాల్ వర్మ తెలుగు రాష్ట్రానికి ఏం చేశాడని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర ఏమిటీ? అంటూ అడిగారు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డాడని, తెలంగాణ వీడిపోయాక దిక్కులేని స్థితిలో ఉన్న రాష్ట్రానికి రాజధానిని నిర్మించారని అన్నారు. కియా, టీసీఎల్, జోహో వంటి వేలాది కంపెనీలను తీసుకువచ్చారని, సుమారు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, అదీ చంద్రబాబు చిత్తశుధ్ది అని వివరించారు. అలాంటిది రామ్ గోపాల్ వర్మ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని అన్నారు.

ఈ కామెంట్ పై ఆర్జీపీ షార్ప్‌గా రియాక్ట్ అయ్యారు. నారా లోకేశ్‌లా తాను సమాజ సేవ చేస్తానని ప్రకటించలేదని, తాను సినిమా డైరెక్టర్‌నని, సినిమాలు తీయడమే తన పని అని వివరించారు. కానీ, నారా లోకేశ్ అలా కాదు కదా అని పేర్కొన్నారు. తనను ఎలా విమర్శించాలో కూడా నారా లోకేశ్‌కు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అనైతిక మనిషి, బాధ్యతలేని మనిషి, సినిమాలు హిట్ కాక నిస్పృహలో ఏది పడితే అది సినిమాగా తీస్తున్నాడని కూడా తనను విమర్శించవచ్చునని, అవసరమైతే అలాంటి వ్యక్తికి తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదని కూడా దాటవేయవచ్చునని చెప్పారు. అంతేకానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తన కాంట్రిబ్యూషన్ ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదని వర్మ అన్నారు.

Also Read: ‘మరాఠా కోటా ప్రకటించేదాకా రాజకీయ నాయకుడు మా గ్రామంలోకి రావొద్దు’

ప్రజా సేవ చేస్తాననే వ్యక్తికి ఈ మాత్రం సబ్జెక్ట్ లేకపోవడం, కనీసం నాలాంటి వాడినీ సరిగ్గా విమర్శించడం రాకపోతే చంద్రబాబును ఆ దేవుడు కూడా కాపాడలేడని వ్యంగ్యం పోయారు. లోకేశ్‌ను చూసి జాలిపడాలా? నవ్వాలా? అనేది అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం వంటిదని వివరించారు.

వాళ్ల డాడీకి అలా కావడం మూలంగా కొంత ఇన్‌స్టబిలిటీ ఉన్నదేమో.. ఏ వైద్యుడినైనా సంప్రదించాలని వర్మ సూచించారు. అంతేకాదు, ఢిల్లీ తరహా మరేదైనా చోటుకు వెళ్లి ప్రశాంతంగా సమయం గడిపితే కుదుటపడుతుందని సలహా ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios