Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి: చంద్రబాబుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు పదవి ఇప్పించుకున్నారని అన్నారు.

Revanth Reddy as TPCC president: Vijayasai reddy makes comments against Chandrababu
Author
Amaravati, First Published Jun 28, 2021, 2:38 PM IST

అమరావతి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నియామకానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి లంకె పెడుతూ ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.

పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడని, ఢిల్లీలో కాంగ్రెసు పెద్దలను కొనిపడేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టు పట్టించాడని, ఇప్పుడు డైరెక్ట్ గా కంట్రోల్ల్లోకి తెచుకున్నాడని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 

కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడని, మనవాళ్లు బ్రీఫుడ్ మీ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని గులాబీ పార్టీలోకి చొప్పించాడని, పచ్చరక్తం నరనరాల్లో ప్రవహించే కరుడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెసులోకి తోలాడని, బాబా మజాకా అని ఆయన అన్నారు. 

రాహుల్ గాందీన ఇంప్రెస్ చేయడానికి ఏం మంత్రం వేశాడో గానీ టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నారని, అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టారని, తెలంగాణ బాబు కాగ్రెసు (TBCC) అనాలేమో ఇక అని ఆయన వ్యాఖ్యానించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios