‘తనకు చనిపోవాలని ఉంది కాబట్టి అనుమతించాలంటూ’ షానవి రాసిన లేఖ జాతీయ స్ధాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ షానవికి వచ్చిన కష్టమేంటి? అంటే, అన్నీ ఉద్యోగాలకు సెలక్టవుతున్నా చివరకు రెజెక్టు చేస్తున్నారట. ఉద్యోగానికి ఎంపికైన తర్వాత కూడా ఎందుకు మళ్ళీ షానవి రెజెక్టవుతోంది. అంటే, షానవి ఓ హిజ్రా కాబట్టి. కేవలం తానొక హిజ్రా అన్న కారణంతోనే అందరూ రెజెక్ట్ చేస్తున్నారంటూ షానవి వాపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, తమిళనాడుకు చెందిన షానవి ఇంజనీరింగ్ చదివింది. ఎయిర్ ఇండియాలో ఉద్యాగానికి దరఖాస్తు పెట్టుకుంది. అన్నీ పరీక్షల్లోనూ పాసైంది. చివరకు ఉద్యోగం ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు కూడా అందించింది.

అయితే, ఉద్యోగంలో చేరే ముందు చేసిన మెడికల్ పరీక్షల్లో షానవి ఓ హిజ్రా అని తేలింది. దాంతో ఎయిర్ ఇండియా ఉద్యోగం ఇవ్వటం లేదని చెప్పేసింది. దాంతో హిజ్రాకు షాక్ కొట్టినట్లైంది. ఎందుకంటే, ఉద్యోగానికి రెజెక్ట్ అవ్వటం ఇదే మొదటిసారి కాదట. చాలాసార్లు ఉద్యోగానికి ఎంపికవ్వటం హిజ్రా అని తేలగానే రెజెక్టవ్వటం జరిగాయట. దాంతో షానవికి జీవితం మీదే విరక్తి పుట్టింది.  చనిపోవాలని నిర్ణయించుకున్నది.

అయితే చివరి ప్రయత్నం చేద్దామని అనుకున్నది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కేంద్రంతో మాట్లాడి తనకు ఉద్యోగమన్నా ఇప్పించాలని లేకపోతే చనిపోయేందుకున్నా అనుమతి ఇవ్వాలంటూ లేఖలో షానవి వేడుకుంది. ఎప్పుడైతే సిఎంకు షానవి రాసిన లేఖ వెలుగు చూసిందో  సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి తమిళనాడు సిఎం ఏం చేస్తారో చూడాలి.