Asianet News TeluguAsianet News Telugu

అన్న కాకుంటే జగనన్న, రాజన్న క్యాంటీన్లు...: సీఎంకు రఘురామ మరో లేఖ

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం ఏర్పాటుచేసిన అన్న క్యాంటిన్లు వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మూతపడ్డాయి. వీటిని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఎం జగన్ కు లేఖ రాశారు. 

reopen anna canteens in ap... raghurama krishnamraju demands jagans government akp
Author
Amaravati, First Published Jun 22, 2021, 10:05 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందిపెట్టెలా వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖలు రాస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం మరో లేఖను రాశారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం ఏర్పాటుచేసిన అన్న క్యాంటిన్లు వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మూతపడ్డాయి. వీటిని తిరిగి ప్రారంభించాలని... అన్న క్యాంటీన్ల బదులు జగనన్న క్యాంటీన్లుగా పేరు మార్చి పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలని రఘురామ కోరారు.

read more  బలం మీదే.. ఇప్పుడు చేయండి జనం నమ్ముతారు: జగన్‌కు రఘురామ లేఖ

ఆకలితో ఉన్నవారికి మంచి ఆహారం అందించడం ఎంతో అవసరమని రఘురామ హితవు పలికారు. లేఖ ద్వారా క్యాంటీన్ల విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. క్యాంటిన్లు తిరిగి ప్రారంభిస్తే మంచి పేరుతో  పాటు 'దైవదూత' అని జన బాహుళ్యంలో స్థిరపడిపోతుందన్నారు. కాబట్టి తక్షణమే జగనన్న క్యాంటీన్ స్కీమ్ ప్రారంభించాలని రఘురామ సూచించారు. 

పేదవారి ఆకలి తీర్చడం ద్వారా ఈ క్యాంటిన్లు మానవత్వం ప్రదర్శించేందుకు వేదిక అవుతాయన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా జగనన్న లేదా రాజన్న క్యాంటీన్ పేరుతో ప్రారంభించాలి మరోసారి సీఎం జగన్ ను కోరుతున్నాను అని రఘురామ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios