Asianet News TeluguAsianet News Telugu

ఆక్సిజన్, రెమిడిసివిర్ బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం...: ఏపి డిజిపి హెచ్చరిక

 రెమిడిసివిర్ ఇంజక్షన్లన్, ఆక్సిజన్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. 

remdesivir oxygen block market... AP DGP Sawang Warning akp
Author
Amaravathi, First Published Apr 29, 2021, 7:04 PM IST

అమరావతి: రాష్ట్రంలో రెమిడిసివేర్ నిల్వలు - వినియోగం, ఆక్సిజన్ నిల్వలు - వినియోగం, ఫీజుల పేరిట దోపిడీ మొదలైన పలు అంశాలపై నిరంతర నిఘా వుంచనున్నట్లు ఏపి డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ తెలిపారు. రెమిడిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్లు డి‌జి‌పి హెచ్చరించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్, మెడికల్ అండ్ హెల్త్ శాఖల సమన్వయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేపట్టనున్నట్లు డి‌జి‌పి వెల్లడించారు. 

''రెమిడిసివేర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లలో అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కు, 1902 కు ఫోన్ చేయండి. కోవిడ్ రోగుల నుండి ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజులపై ఆరా తీస్తున్నాం. పరిమితికి మించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయి. ఆ సమాచారాన్ని డయల్ 100, 1902 ద్వారా చేరవేయండి" అని డిజిపి సూచించారు.  

''ఆక్సిజన్ వాహనాలకు రవాణా పరమైన ఇబ్బందులు కలగకుండా గ్రీన్  ఛానల్ ఏర్పాటు చేస్తాం. అందుకోసం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నోడల్ ఆఫీకారులు నియమించాం. ఇతర శాఖలతో సమన్వయం కొరకు  కోవిడ్ కంట్రోల్ రూమ్ లో ఇద్దరు ఐపీఎస్ అధికారుల నియమించాం'' అని తెలిపారు.

''కోవిడ్ నిబంధనలను తూఛా తప్పకుండా పాటించండి. మాస్క్ ధరించక పోతే జరిమానాలు విధిస్తాం. రాత్రి పూట కర్ఫ్యూ సమర్థవంతంగా అమలు చేయాలి. సామాజిక మాధ్యమాల్లో కరోనాపై అవాస్తవాలు, పుకార్లను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కోవిడ్ ఆసుపత్రులపై సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలు వ్యాపింప చేస్తున్నారు. ఇటువంటి శక్తులపైనా నిఘా వుంచాం. ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తో వ్యవహరించాలి'' అని డిజిపి సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios