Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య : నిందితుల రిమాండ్ పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీ వరకు పులివెందుల కోర్టు రిమాండ్ పొడిగించింది.
 

remand of accused extended in ys vivekananda murder case
Author
Kadapa, First Published Apr 8, 2019, 2:33 PM IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో నిందితులకు ఈ నెల 22వ తేదీ వరకు పులివెందుల కోర్టు రిమాండ్ పొడిగించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఈ ఏడాది మార్చి 14వ తేదీ రాత్రి  హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఉద్దేశ్యంతో వివేకానందరెడ్డి సన్నిహితుడు గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంటమనిషి కొడుకు ప్రకాష్‌లను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ముగ్గురు నిందితులు జైల్లో ఉన్నారు.

ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం నాడు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు 
ఈ  నెల 22వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ  కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios