Asianet News TeluguAsianet News Telugu

కొబ్బరినూనెతో కరోనా ఖతం చేస్తానంటూ.. ఆస్పత్రిలో మహిళ హల్ చల్.. !!

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంటే మరోవైపు ఇదే అదనుగా కొన్ని ముఠాలు కరోనాను తగ్గిస్తామంటూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఏకంగా ఆసుపత్రుల్లోకే చొరబడి మరీ ప్రచారం సాగిస్తున్నాయి. కొబ్బరినూనె రాసి కరోనాను తరిమికొడతాం అంటూ  ఊదరగొడుతున్నాయి.

religion advertisements with coconut oil at kakinada covid wards - bsb
Author
Hyderabad, First Published Apr 26, 2021, 1:08 PM IST

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంటే మరోవైపు ఇదే అదనుగా కొన్ని ముఠాలు కరోనాను తగ్గిస్తామంటూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఏకంగా ఆసుపత్రుల్లోకే చొరబడి మరీ ప్రచారం సాగిస్తున్నాయి. కొబ్బరినూనె రాసి కరోనాను తరిమికొడతాం అంటూ  ఊదరగొడుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆసుపత్రుల్లో జరుగుతున్న ఈ ఘటనలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కరోనా వచ్చి ఉంటామో పోతామో తెలియని స్థితిలో జనాలు ఆస్పత్రిలో చేరుతున్న సమయంలో కొబ్బరి నూనె రాసి ప్రార్థనలు చేస్తే కరోనా నయమవుతుంది అంటూ ఓ ముఠా ఆస్పత్రి వార్డులో ప్రచారానికి దిగింది.

తాజాగా కోవిడ్ వార్డులను సైతం వదలకుండా ఈ ముఠా చేసిన ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో  మత ప్రచారం జోరుగా సాగుతోంది. కొబ్బరినూనెను తలకు రాసి ఓ ముఠా ప్రార్థనలు చేస్తోంది. అంతేకాదు ప్రార్థనతో వ్యాధి నయం అవుతుందని హితోక్తులు చెబుతోంది.

ఆసుపత్రి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా మత ప్రచారం సాగుతోంది. జనరల్, సర్జికల్ వార్డుల్లో కొబ్బరి నూనె రాస్తూ సదరు ముఠా ప్రార్థనలు నిర్వహిస్తోంది. రాత్రివేళల్లోనూ యథేచ్ఛగా మత ప్రచారం నిర్వహిస్తూ కొందరు మహిళలు ప్రార్థనలు చేస్తున్నారు.

 అయితే  వార్డుల్లోకి రాకూడదని ఆస్పత్రి సిబ్బంది వారించినప్పటికీ.. ‘నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు... నా ఇష్టం నేను వస్తానంతే..’ అని ఆ మహిళ హెచ్చరించడం గమనార్హం. అయితే ఇంత జరుగుతున్నా ఈ విషయం మీద ఆసుపత్రి సూపర్డెంట్ గానీ, అధికారులు గానీ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios