Asianet News TeluguAsianet News Telugu

వివాహిత ఆత్మహత్య : నగ్నంగా వీడియో తీసి.. బంధువుల వేధింపులు.. !

గుంటూరులో దారుణం జరిగింది. ఓ వివాహిత స్నానం చేసేప్పుడు వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. బ్లాక్ మెయిల్ చేసింది ఆమె బంధువులే కావడం దుర్గార్గం. 

relatives are harassing the woman in guntur district - bsb
Author
Hyderabad, First Published May 4, 2021, 10:00 AM IST

గుంటూరులో దారుణం జరిగింది. ఓ వివాహిత స్నానం చేసేప్పుడు వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. బ్లాక్ మెయిల్ చేసింది ఆమె బంధువులే కావడం దుర్గార్గం. 

ఓ వివాహితన స్నానం చేస్తుండగా కొంతమంది బంధువులు వీడియో తీశారు. ఆ వీడియో బయట పెట్టకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేశారు. లక్షల రూపాయలకు ఇచ్చిన ఇంకా కావాలని డిమాండ్ చేశారు. ఆమెను చనిపోవాలని ప్రేరేపించారు. 

ఈ వేధింపులు తాళలేక ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి అందులో వేధింపుల వైనాన్ని వివరించింది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు.. పొన్నూరు 17వ వార్డు లో నివసించే బలిమిడి లక్ష్మీ తిరుపతమ్మ (32) ఈ నెల ఒకటో తేదీన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.

పనికి వెళ్లిన భర్త  శ్రీనివాస రావు ఇంటికి వచ్చినా భార్య ఎంత సేపటికీ ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానంతో.. అతను అత్తమామలు, బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అందరూ కలిసి తలుపులు పగలగొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఎండీ గోపాలకృష్ణకు తీవ్ర అస్వస్థత...

చికిత్స చేశాక స్పృహలోకి వచ్చిన ఆమె తన ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులకు తెలిపింది. అన్ని వివరాలతో ఫోన్ లో వీడియో తీసి ఉంచాలని చూడాలని చెప్పింది. ఫోన్ లో వీడియో చూడగా లక్ష్మీ తిరుపతమ్మ స్నానం చేస్తుండగా బంధువులు కొందరు నగ్నంగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఉంది.

లక్షల్లో ఇచ్చానని, ఇంకా కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, దీంతో చనిపోవాలని నిర్వహిస్తున్నారని అడిగినంత డబ్బు ప్రేరేపిస్తుంది. అని అడిగిన డబ్బు తమకు ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతామని బెదిరిస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేసింది చికిత్సపొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మీ తిరుపతమ్మ ఆదివారం మృతి చెందింది.

తన భార్య మృతికి కారణమైన అన్నావారి శ్రీనివాసరావు, కొంకిపూడి సురేష్, నాగలక్ష్మి, సూర్యారెడ్డి, హరీష్, కొంకిపూడి లక్ష్మీ తిరుపతమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ శరత్ బాబు తెలిపారు. నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రిని పరిశీలించేందుకు సోమవారం వచ్చిన కలెక్టర్ వివేక్ యాదవ్ ను లక్ష్మీ తిరుపతమ్మ భర్త, బంధువులు కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించారు.

Follow Us:
Download App:
  • android
  • ios