ఎర్రచందనం స్మగ్లర్లు బాగా తెగిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ యాక్టివిటీ పెరిగే కొద్దీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అప్రమత్తమవుతున్నారు. ఒకపుడు పోలీసులను చూడగానే స్మగ్లర్లు పారిపోయేవారు. కానీ ఇపుడు ఎదురుతిరుగుతున్నారు. అడవుల్లో అయితే ఏకంగా కాల్పులే మొదలు పెడుతున్నారు. తాజాగా శనివారం ఉదయం అటువంటి ఘటనే తిరుపతికి సమీపంలో జరగటం సంచలనంగా మారింది.

ఈరోజు తెల్లవారు జామున ఏర్పేడు దగ్గర ఎర్రచందనం  స్మగ్లింగ్ జరుగుతోందని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు ఏర్పేడుకు చేరుకుని వాహనాల చెకింగ్ మొదలుపెట్టారు. దూరంగా ఉన్న ఓ వాహనంలో నుండి కొందరు దిగి పారిపోవటాన్ని పోలీసులు చూసారు. దాంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు చేజింగ్ మొదలుపెట్టారు. అయితే, వారిలో ఒకరిద్దరు కత్తులతో పోలీసులకు ఎదురు తిరిగారు. దాంతో పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకున్నారు. స్మగ్లింగ్ కూలీలతో పాటు లారీని అందులోని 82 ఎర్రచందనం దుంగలను కూడా పట్టుకున్నారు.