ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్.. స్మగ్లింగ్ డబ్బుతో సినిమాలకు పెట్టుబడి..తాజాగా షకలక శంకర్‌తో సినిమా

red sandalwood smuggler arrest in tirupati
Highlights

జబర్దస్త్ టీవీ షోలో ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ నటుడికి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే ముఠాలతో సంబంధం ఉందని... ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా అతను కోట్లాది రూపాయలు సంపాదించాడని వార్తలు రావడం తెలుగు రాష్ట్రాల్లో పెద్దు దుమారాన్ని రేపింది. అతనిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

జబర్దస్త్ టీవీ షోలో ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ నటుడికి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే ముఠాలతో సంబంధం ఉందని... ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా అతను కోట్లాది రూపాయలు సంపాదించాడని వార్తలు రావడం తెలుగు రాష్ట్రాల్లో పెద్దు దుమారాన్ని రేపింది. అతని గురించి అన్ని రకాలుగా ఆరాలు తీసిన టాస్క్‌ఫోర్స్ పొలీసులు ఆ వ్యక్తి కోసం తీవ్రంగా గాలించారు. చివరకు అతన్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు..

ఇతనికి టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా వచ్చిన డబ్బును సినిమాలకు పెట్టుబడి పెడతాడని పోలీసులు వెల్లడించారు. తాజాగా కమెడియన్ షకలక శంకర్ హీరోగా నటించిన ఓ సినిమాకు ఈ స్మగ్లరే పెట్టుబడి పెట్టాడని..  నటన మీద ఆసక్తితో టీవీ సీరియళ్లలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంటాడని.. వెనుక దందాలు కొనసాగిస్తున్నాడని పోలీసులు స్పష్టం చేశారు.

loader