విజయవాడ కనకదుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో రికార్డు అసిస్టెంట్‌ను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రికార్డు అసిస్టెంట్ సస్పెండ్ కావడం ఇది రెండోసారి.
విజయవాడ కనకదుర్గమ్మ చీరల మాయం వ్యవహారంలో రికార్డు అసిస్టెంట్‌ను ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో రికార్డు అసిస్టెంట్ సస్పెండ్ కావడం ఇది రెండోసారి. 2019-20లో దుర్గమ్మకు భక్తులు సమర్పించిన 77 పట్టు చీరలు మాయం అయ్యాయి. వాటి విలువ ఆరున్నర లక్షల రూపాయలుగా ఉంటుందని గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆలయ ఈవో.. రికార్డు అసిస్టెంట్ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ఇదే వ్యవహారానికి సంబంధించి సుబ్రహ్మణ్యం గతంలో కూడా ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యారు. అయితే ఆ తర్వాత తిరిగి విధుల్లో చేరారు. అయితే నకిలీ ఇండెంట్లతో రికార్డ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం దొరికిపోవడంతో ఆలయ ఈవో అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అయితే 77 చీరలకు సంబంధించి దుర్గమ్మ ఆలయానికి రూ. 6.50 లక్షల నష్టం కలిగిందన్న కారణంతో రికార్డ్ అసిస్టెంట్ రెండో సారి సస్పెండ్ అవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి గుడిలో ఇలా చేస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. అమ్మవారిని భక్తులు ఎంతో భక్తిగా సమర్పించిన చీరలు మాయం అవుతుంటే.. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
