నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. చివరి ఘ‌టానికి మ‌రో అడుగు దూరంలో ఉంది. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో 2,18,858 మంది ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. చివరి ఘటానికి మరో అడుగు దూరంలో ఉంది. హోరా హోరిగా జరిగిన పార్టిల ప్రచారం నిన్నటి సాయంత్రం 6 గంటలకు ముగిసింది. రేపు జరిగే పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నంద్యాల నియోజకవర్గంలో 2,18,858 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో 72.09శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు క్యూలో నిలబడిన వారికి ఓటు హాక్కును వినియోగించుకోవచ్చు.

ఎన్నికల కమీషన్ నంద్యాల ఉప ఎన్నిక కోసం మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో 74 సమస్యాత్మక, 141 అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్ లుగా గుర్తించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. పోలింగ్ బూత్ల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. 2,500 మంది పోలీసులను మోహరించారు. ఓటర్ స్లిప్లను ఇప్పటికే అందజేశారు.

మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
