శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలోని అరబిందో ఫార్మాలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలవ్వగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

మృతిచెందిన వారిలో షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ రాహుల్, బాయిలర్ ఆపరేటర్ రాజారావు వున్నారు. సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నేతలు ఫ్యాక్టరీ వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే వారిని లోపలికి అనుమతించలేదు.

గేట్లకు తాళాలు వేసిన యాజమాన్యం ఎవరిని లోపలికి రావడానికి అనుమతించడం లేదు. దీంతో కార్మిక నేతలు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు.