Asianet News TeluguAsianet News Telugu

సొంత జిల్లాలో జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత, చంద్రబాబుతో భేటీ

తిరుపతి ఉప ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, రాయచోటీ వైసీపీ నేత రాంప్రసాద్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశారు. 

rayachoti ysrcp leader mandipall ramprasad reddy meets chandrababu naidu ksp
Author
Amaravathi, First Published Apr 9, 2021, 6:54 PM IST

తిరుపతి ఉప ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, రాయచోటీ వైసీపీ నేత రాంప్రసాద్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశారు.

ఆయన త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలు వున్నాయని సమాచారం. ప్రస్తుతం కడప జిల్లా వైసీపీలో చంద్రబాబు, రాం ప్రసాద్ రెడ్డి కలయిక హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నెల 14వ తేదీన తెలుగుదేశం పార్టీలో ఆయన చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే , సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపులో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని కడప జిల్లాలో టాక్.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ పదవి ఇస్తారని మండిపల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా తనను కనీసం పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ, అసంతృప్తికి లోనైన రాంప్రసాద్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే మండిపల్లి నిర్ణయంపై స్థానిక వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి, 

Follow Us:
Download App:
  • android
  • ios