అమరావతి: నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎన్ఆర్ఐ పండుగాయల రత్నాకర్ ను నియమించారు సీఎం జగన్. రత్నాకర్ నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 

ప్రత్యేక ప్రతినిధిగా నియమితులవ్వడంపై పండుగాయల రత్నాకర్ సంతోషం వ్యక్తం చేశారు. తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్దితో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదఏశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు. తనమీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పండుగాయల రత్నాకర్.  

పండుగాయల రత్నాకర్ స్వస్థలం కడప జిల్లా రాజంపేట. ప్రస్తుతం రత్నాకర్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  యూఎస్ఏ కన్వీనర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ అమెరికా పర్యటనలో కూడా రత్నాకర్ కీలక పాత్ర పోషించారు.