కాకినాడలో కేఏపాల్ కు చేదు అనుభవం: పాల్ కార్లను దాచి పెట్టిన రత్నకుమార్
కాకినాడలో ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. పాల్ కు చెందిన కార్లను రత్నకుమార్ అనే వ్యక్తి తన కాంపౌండ్ లో దాచి పెట్టాడు. పాల్ తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన కార్లను దాచి పెట్టినట్టుగా రత్నకుమార్ చెబుతున్నారు.
కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో Praja Shanti Party అధినేత కెఎ పాల్ కు చేదు అనుభవం ఎదురైంది. పాల్ కు చెందిన కార్లను రత్నకుమార్ తన కాంపౌండ్ లో దాచిపెట్టాడు. కేఏ పాల్ తనకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వాల్సి ఉన్నందనే ఈ కార్లను ఇక్కడే ఉంచామని రత్నకుమార్ వర్గీయులు చెబుతున్నారు. అయితే రత్నకుమార్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కార్లను ఇక్కడే పార్క్ చేయాలని సూచించి ఇవాళ మాత్రం డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారని పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
బుధవారం నాడు కేఏ పాల్ పర్యటించారు. తన పార్టీ విధి విధానాలను ka paul మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. రత్నకుమార్ అనే వ్యక్తి గతంలో కేఏపాల్ తో కలిసి మత ప్రచార సభల్లో పాల్గొన్నారు. తనకు పాల్ పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని Ratna kumar చెబుతున్నారు. ఈ విషయమై పాల్ ను ఎన్ని దఫాలు అడిగినా కూడా స్పందించడం లేదని రత్నకుమార్ ఆరోపిస్తున్నారు.
పాల్ కాన్వాయ్ లోని రెండు కార్లను రత్నకుమార్ Kakinada లో సీబీఎన్‌సీ కాంపౌండ్ లో ఉంచాడు. ఈ కార్లను తీసుకెళ్లేందుకు గురువారం నాడు ఉదయం సీ బీఎస్ సీ కాంపౌండ్ వద్దకు ఇవాళ కేఏపాల్ అనుచరులు వచ్చారు. అయితే రత్నకుమార్ ఈ కౌంపౌండ్ గేటుకు తాళం వేయడంతో కార్లను బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. గేటు తాళం తీయాలని అక్కడే ఉన్న రత్నకుమార్ అనుచరులతో కేఏ పాల్ అనుచరులు వాగ్వావాదానికి దిగారు. అయితే పాల్ నుండి రత్నకుమార్ కు డబ్బులు ఇస్తే కార్లను బయటకు తీసేందుకు అనుమతిని ఇస్తామని రత్నకుమార్ అనుచరులు చెబుతున్నారు. ఈ విషయమై తన అనుచరులకు రత్నకుమార్ ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నారు.
రత్నకుమార్ నుండి ఆదేశాలు అందితేనే తాము కార్లను వదిలిపెడుతామని వారు చెబుతున్నారు. అయితే ఈ విషయమై కేఏ పాల్ పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాలతో చర్చిస్తున్నారు. రత్నకుమార్ కు చెల్లించాల్సిన డబ్బులను పాల్ గతంలోనే చెల్లించినట్టుగా పాల్ వర్గీయులు చెబుతున్నారు.