టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు సవాల్ విసిరారు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు చేస్తానంటే కుదరదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు.. గన్‌మెన్‌లు లేకుండా బయటకు రాగలరా అని సవాల్ విసిరారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.
టీడీపీలో (tdp) చేరికలు పెరుగుతుంటే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (thopudurthi prakash reddy) ఒంట్లో వణుకు పుడుతోందన్నారు పరిటాల శ్రీరామ్ (paritala sriram). వైసీపీ పాలనలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారంతా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రెవెన్యూ, పోలీసుల పని పడతామని శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.
అంతకుముందు పోలీసులపై పరిటాల శ్రీరామ్, సునీతల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. పోలీసులు నిజాయితీగా పనిచేస్తుంటే పరిటాల కుటుంబానికి నచ్చదన్నారు. క్రిమినల్స్‌కు షెల్టర్ ఇచ్చే సంస్కృతి వారిదేనంటూ తోపుదుర్తి చురకలు వేశారు. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు చేస్తానంటే కుదరదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు.. గన్‌మెన్‌లు లేకుండా బయటకు రాగలరా అని సవాల్ విసిరారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.
Also read:పరిటాల శ్రీరామ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత..
ఇకపోతే.. ఈ నెల 9వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించిన సంగతి తెలిసిందే. రైతు సమస్యలపై శనివారం గొందిరెడ్డిపల్లిలో నిరసనకు పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పరిటా శ్రీరామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పరిటాల ఇంటి వద్ద కూర్చొని నిరసనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. వైసీపీ నేతల ప్రోత్బలంతో మమ్మల్ని అడ్డుకోవడం పోలీసులకు ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. “చలో గొందిరెడ్డిపల్లి” కార్యక్రమాన్ని ముందస్తుగా అడ్డంకులు సృష్టించడానికి పోలీసులను ఉపయోగించుకుంటూ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని చెప్పారు.
