లోన్ కోసం వెళితే లోబర్చుకోబోయాడు... మహిళపై ఫైనాన్స్ సంస్థ యజమాని అత్యాచారయత్నం (వీడియో)
లోన్ కోసం వెళ్లిన మహిళను లోబర్చుకుని అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో ఫైనాన్స్ సంస్థ అధినేత. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది.

నరసరావుపేట : ఆర్థిక అవసరాల కోసం లోన్ కోసం వెళితే సదరు ఫైనాన్స్ సంస్థ యజమాని అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఓ మహిళ ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు అతడిపై చర్యలు తీసుకోలేదని... రాజీ చేసుకోవాలని స్థానిక సీఐ ఒత్తిడి తెస్తున్నారని బాధిత మహిళ తెలిపింది. దీంతో బాధితురాలు పల్నాడు జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో ఈ అత్యాచారయత్నం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పావులూరి నాగలక్ష్మి ఆర్థిక అవసరాలు వుండటంతో స్థానిక చరిష్మా ఫైనాన్స్ లో లోన్ కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఫైనాన్స్ సంస్థ యజమాని నరేంద్ర కన్న ఆమెపై పడింది. ఆమె ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని లోబర్చుకోడానికి ప్రయత్నించాడు. లోన్ కు సంబంధించిన పేపర్లు తీసుకుని తన రూంకు రావాలని కోరగా ఈ నెల(సెప్టెంబర్) 4న నాగలక్ష్మి వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెను పట్టుకుని అత్యాచారయత్నానికి పాల్పడగా తప్పించుకుని డయల్ 100 కు కాల్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఫైనాన్స్ సంస్థ యజమాని నరేంద్రను అరెస్ట్ చేసారు.
వీడియో
అయితే తనపై జరిగిన అత్యాచారయత్నంపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడంలేదని నాగలక్ష్మి ఆరోపిస్తోంది. నిందితుడిపై కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని స్థానిక సీఐ వీరేంద్ర ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. దీంతో న్యాయం చేయాలని పల్నాడు ఎస్పీని కోరినట్లు నాగలక్ష్మి తెలిపింది.
Read More మైనర్ బాలికను రెండేళ్లు ప్రేమించి, గర్భవతిని చేసి.. మరో యువతితో వివాహం.. తట్టుకోలేక...
ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న చరిష్మా ఫైనాన్స్ అధినేతను వెంటనే అరెస్ట్ చేయాలని నాగలక్ష్మి కోరుతోంది. తనలాగే మరే మహిళ ఈ నిందితుడి చేతిలో మోసపోకుండా వుండాలనే న్యాయపోరాటం చేస్తున్నట్లు నాగలక్ష్మి తెలిపింది.