మైనర్ బాలికను రెండేళ్లు ప్రేమించి, గర్భవతిని చేసి.. మరో యువతితో వివాహం.. తట్టుకోలేక...
ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండలేనంటూ ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పాడేరులో వెలుగు చూసింది.

పాడేరు : ఓ వ్యక్తి మైనర్ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలతో వంచించి ఆ తర్వాత వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతని మోసంతో గర్భవతి అయిన బాలిక ఏం చేయాలో తెలియక..ప్రేమించిన వ్యక్తి మోసానికి తట్టుకోలేక.. అతడికి రెండో భార్యగా ఉండలేనని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని పాడేరులో వెలుగు చూసింది.
దీనికి సంబంధించిన వివరాలను ఎస్ఐ సతీష్ ఈ మేరకు తెలిపారు. తడిగిరి పంచాయతీ బోడ్డాపుట్టు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17), శోభకోట పంచాయితీ ఈదులగొంది గ్రామానికి చెందిన పాంగి చిట్టిబాబు అనే వ్యక్తి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో చిట్టి బాబుకు కుటుంబ సభ్యులు మరో వివాహం నిర్ణయించారు.
చంద్రబాబు అరెస్ట్ : మనస్తాపం చెందిన టీడీపీ మహిళ.. మందుకొట్టి, అర్థనగ్నంగా హైవేపై హల్ చల్...
నెల రోజుల క్రితం వివాహం కూడా జరిగింది. ఈ విషయం బాలికకు తెలిసింది. అయితే సదరు బాలిక అనారోగ్యం బారిన పడడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భిణీ అని తెలిపారు. దీనికి కారణం చిట్టిబాబు అని తెలియడంతో కుటుంబ సభ్యులు, బాలిక బంధువులు చిట్టిబాబు ఇంటికి చేరుకున్నారు.
ఆదివారం సాయంత్రం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించారు. బాలికను గర్భవతిని చేశాడని.. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశారు. చిట్టి బాబు దీనికి అంగీకరించాడు. ఈ మేరకు బాలికను తీసుకొని తన స్వగ్రామమైన బోడ్డాపుట్టుకు వెళ్లాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటి గంటకి బాలిక ఇంట్లో నుంచి బయటికి వచ్చింది.
ఆ గ్రామంలో తన బంధువులు ఉన్నారని వారి దగ్గరికి వెళ్ళొస్తానని తెలిపింది. అక్కడి నుంచి నేరుగా ఓ మామిడి చెట్టు దగ్గరికి వెళ్లింది. తాను ప్రేమించిన వ్యక్తికి రెండో భార్యగా ఉండలేనని తన సోదరికి మెసేజ్ పెట్టింది. తాను ఉరివేసుకుంటున్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ లో తెలిపింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
ఈ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత మృతదేహాన్ని పాడేరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టారు.