కందుకూరులో దారుణం... మూగ మహిళపై ముగ్గురు దుండగుల అత్యాచారయత్నం
మూగ యువతిపై పట్టపగలే ముగ్గురు దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం కందుకూరులో చోటుచేసుకుంది.

నెల్లూరు :పట్టపగలు నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళతున్న మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే దుండగుల నుండి తప్పించుకున్న మహిళ పెట్రోల్ బంక్ లోకి పరుగుతీసింది. బంక్ సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించి సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో ఓ మూగ మహిళ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుండగా ముగ్గురు దుండగులు వెంటపడ్డారు. మాటలు రాని ఆమెను పట్టుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వారి నుండి తప్పించుకున్న మహిళ దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్ లోకి వెళ్లి మానప్రాణాలు కాపాడుకుంది.
Read More దేవుడి పటాలు కాలిపోయాయని.. దొంగస్వామి దగ్గరికి వెడితే...మహిళను మోసం చేసి, పైగా...
పెట్రోల్ బంక్ సిబ్బంది సమాచారం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళ నుండి వివరాలు సేకరించారు. ఆమెపై అఘాయిత్యానికి యత్నించింది ఓ ఆటో డ్రైవర్, ఇద్దరు గూర్ఖాలుగా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే వారిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దివ్యాంగురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.