పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో దారుణం వెలుగుచూసింది. ఇంటిపక్కనుండే ఏడేళ్ల బాలికపై ఓ వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
చిలకలూరిపేట: వావివరసలు, చిన్నాపెద్ద తేడాలేకుండా ఆడబిడ్డలను అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే మహిళలపై అఘాయిత్యాలు ఇటీవల మరీ ఎక్కువయ్యాయి. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిపై అత్యాచారం మొదలు ప్రతిరోజూ ఏదో దారుణం వెలుగుచూస్లేనే వుంది. తాజాగా మనవరాలి వయసున్న ఏడేళ్ల చిన్నారితో అత్యంత నీచంగా ప్రవర్తించాడో వృద్దుడు. సభ్యసమాజం తలదించుకునేలా ఈ అమానుషం పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం గణపవరం గ్రామం రాజీవ్ గాంధీ కాలనీలో ఓ కుటుంబ నివాసముంటోంది. ఓ ఏడేళ్ల చిన్నారి కలిగిన ఆ కుటుంబం నివాసముండే ఇంటిపక్కనే ఓ వృద్దుడు నివాసముంటున్నాడు. అయితే మనవరాలి వయసుండే చిన్నారి బాలికపై కన్నేసిన అతడు నీచానికి ఒడిగట్టాడు.
బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించాడు వృద్దుడు. అభం శుభం తెలియని బాలిక అతడు చెప్పినట్లు వినేది. ఈ క్రమంలోనే ఇంటిబయట ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిని చూసిన వృద్దుడు ఇదే అదునుగా భావించాడు. చిన్నారివద్దకు వెళ్లి తన ఇంట్లో టీవి చూపిస్తానని తీసుకెళ్లి ఉదయం నుండి మద్యాహ్నం వరకు అక్కడే వుంచుకున్నాడు.
ఇంటా బయట బాలిక కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకసాగారు. ఈ క్రమంలో బాలిక వృద్దుడి ఇంటినుండి బయటకు వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు ప్రశ్నించగా వృద్దుడు ఇంట్లోకి తీసుకెళ్లి ఏం చేసాడో తెలిపింది. చిన్నారి మాటలనుబట్టి ఆమెపై వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తల్లిదండ్రులు భావిస్తున్నారు.
తమ కూతురితో నీచంగా ప్రవర్తించిన వృద్దుడిపై పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మనవరాలి వయసుండే చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వృద్దుడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు గ్రామస్తులో కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇలా చిన్నారిపై ఇంటిపక్కన వృద్దుడు అఘాయిత్యానికి యత్నిస్తే సొంత అన్నే చెల్లిపై కన్నేసి గర్భవతిని చేసిన దారుణం తెలంగాణలో వెలుగుచూసింది. వావివరుసలు మరచిన ఓ కాలేజీ యువకుడు సొంత చెల్లి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కేరళ నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ఓ కుటుంబం మేడ్చల్ జిల్లా పరిధిలో బాచుపల్లిలోని ఓ కాలనీలో నివాసం ఉంటుంది. కుటుంబ యజమాని వ్యాపారం నిర్వహిస్తుండగా, భార్య ఐటీ ఉద్యోగి. వీరి కుమారుడు (17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె(13) తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు ఓ గదిలి, పిల్లలిద్దరూ మరో గదిలో నిద్రించేవారు. ఈ క్రమంలోనే యువకుడు సొంత చెల్లితో నీచంగా ప్రవర్తించాడు.
చెల్లెలిని లోబరుచుకున్న యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడు.అయితే ఇటీవల బాలికకు కడుపు నొప్పి రావడంతో మాదాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. దాంతో బాలిక గర్భవతి అని తేలింది. కొడుకే ఈ నీచానికి పాల్పడటంతో గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించడానికి ఈస్ట్ మారేడ్పల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు విషయాన్ని మేడ్చల్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డిసిపియు)కు సమాచారం ఇచ్చారు. ఆ విభాగం అధికారుల ఫిర్యాదుమేరకు బాచుపల్లి పోలీసులు నిందితుడిపై ipc 376(2) సెక్షన్ తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసారు.
