ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదు: శశికృష్ణకు ఉరిపై రమ్యశ్రీ తండ్రి
ఇంత త్వరగా తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని తాము అనుకోలేదని రమ్యశ్రీ తండ్రి చెప్పారు. శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించడంపై ఆయన స్పందించారు.
గుంటూరు: ఇంత త్వరగా తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని అనుకోలేదని బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ తండ్రి అభిప్రాయపడ్డారు.శశికృష్ణకు గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరి శిక్ష విధించిన తర్వాత శుక్రవారం నాడు కోర్టు ఆవరణలో రమ్యశ్రీ తండ్రి మీడియాతో మాట్లాడారు. న్యాయం జరిగిందని న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు. ప్రేమోన్మాదులకు ఇలాంటి శిక్షపడాలని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.ఇంత త్వరగా న్యాయం జరుగుతుందని అనుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉరిశిక్ష అమలైన రోజు మరింత సంతోషిస్తామన్నారు రమ్య పేరేంట్స్..రమ్యను పిలిచి అత్యంత దారుణంగా హత్య చేశాడని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొన్నారు.కష్టకాలంలో ప్రభుత్వం తమను ఆదుకొందని వారు చెప్పారు. తన బిడ్డ ఆత్మ శాంతించిందని రమ్య తల్లి తెలిపారు.
బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ హత్య కేసుపై అప్పట్లోనే సీఎం జగన్ స్పందించారు.బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు. అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 లక్షలు చెల్లించారు. గత ఏడాది సెప్టెంబర్ 9న సీఎం జగన్ వద్దకు రమ్యశ్రీ కుటుంబ సభ్యులను అప్పటి హోం మంత్రి సుచరిత తీసుకెళ్లారు. ఘటన జరిగిన తీరును సీఎం జగన్ తెలుసుకొన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. రమ్యశ్రీ కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చారు. అంతేకాదు రమ్య సోదరికి ఉద్యోగం ఇచ్చారు. ఐదు ఎకరాల పొలం కూడా ప్రభుత్వం ఇచ్చింది.