పవన్ కల్యాణ్ పై మరోసారి ఆర్జీవీ విరుచుకుపడ్డారు. నీ మీదే ‘పాపం పసివాడు’ అనే సినిమా తీయాలంటూ సెటైర్లు విసిరారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఎవరైనా ‘పాపం పసివాడు’ అనే సినిమా తీయాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ కు తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన రీతిలో పవన్ కల్యాన్ మీద విరుచుకు పడ్డాడు. 

‘ఈ సినిమా నీతో కూడా ఎవరైనా తీయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో కూడిన అమాయకత్వం.. అమాయకత్వంతో కూడిన దద్దమ్మగా ఉన్నందుకు నీ మీద ఈ సినిమా తీయాలని నేను ఆశిస్తున్నాను. అయితే, ఇక్కడ ఒక చిన్న మార్పు చేయాలి : ఆ ఒక్క పాత్ర.. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతూ అనేక పాత్రలుగా కనిపించేలా దీన్ని మార్చాలి..’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

పాపం పసివాడు.. జగన్ పై పవన్ కల్యాణ్ సెటైరికల్ ట్వీట్..

పవన్ కళ్యాణ్ పేరును ట్యాగ్ చేస్తూ.. ‘నువ్వు ఎన్టీరామారావు కాదు ఎంజీఆర్ కాదు ..నీకు ప్రజాసేవ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు .. ‘ప్రజాసేవ’ ముసుగులో.. దురుద్దేశంతో అమాయక అభిమానులను రెచ్చగొట్టి, హింసను ప్రేరేపించే విధానాలు నీవి.. ఏదో ఒక రోజు మీ జన సైనికులు మీ నుండి, మీ మానసిక నార్సిజం నుండి విముక్తి పొందుతారని ఆశిస్తున్నాను..’ అంటూ విరుచుకుపడ్డారు.

సేమ్ పవన్ కల్యాణ్ రాసినట్టుగానే.. రాంగోపాల్ వర్మ కూడా అదే రీతిలో ట్వీట్ చేస్తూ.. చివర్లో పీఎస్ లో... ‘ఈ కథనానికి రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దిబ్బలు కావాలి, కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై అబద్ధాలు విసరడానికి మీకు హైదరాబాద్ అవసరం’ అంటూ ట్వీట్ చేశారు. దీనిమీద చాలామంది రీ ట్వీట్లు చేశారు.

ఒకరు.. రాంగోపాల్ వర్మను ఉద్దేశించి.. జగన్ ను అంటే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావ్ తాతా.. ఎంత తీసుకున్నావేంటి వైసీపీ నుంచి.. అంటూ.. పవన్ ఫ్యాన్స్ వర్మ మీద ట్రోల్స్ మొదలు పెట్టారు. 

Scroll to load tweet…