జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. ‘పాపం పసివాడు..’ అంటూ ఓ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

అమరావతి : ‘మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నాను. అతను పాపం ఏమీ తెలియని అమాయకుడు. ఈ పోస్టర్ ఆయనకోసమే.. అయితే ఇందులో ఓ చిన్న మార్పు చేయాలి. ఆ పసివాడి చేతిలో 'సూట్‌కేస్'కి బదులుగా, జగన్ అక్రమంగా సంపాదన కోసం.. మనీలాండరింగ్‌ చేయడానికి ఏర్పాటు చేసిన బహుళ 'సూట్‌కేస్ కంపెనీలను' పెట్టాలి. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో ‘వర్గయుద్ధం’ అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు. ఏదో ఒక రోజు ‘రాయలసీమ’ మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఈ ట్వీట్ కు కామెంట్ చేస్తూ.. ఫొటోను షేర్ చేశారు పవన్ కల్యాణ్.

ఇక దీనికి పీఎస్ కూడా ఇస్తూ... ఈ స్టోరీకి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు అవసరమయ్యాయి. కానీ వైసీపీ స్టోరీకోసం రాజస్థాన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వైసీపీ ఏపీలోని నదీ తీరాలను దోచుకుంది, కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!! అంటూ సెటైర్లు విసిరారు. 

Scroll to load tweet…

జనసేన టీడీపీ పొత్తుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు...పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం మాత్రమే తెలుసంటూ సెటైర్లు...

నిన్న బాపట్ల జిల్లాలో మాట్లాడుతూ జగన్.. పవన్ కల్యాణ్ మీద సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జగన్ నాపై ఎన్ని వ్యవస్థలను ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీపడలేదు. ప్రజల తరపున నిలబడ్డా, వారికి ఎంతో మంచి చేస్తున్నా అని తోడుగా నిలవమని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్‌తో అంటకాగిన వాళ్లు నన్ను విమర్శిస్తున్నారన్నారు. అందరూ కలుస్తున్నామంటున్నారు ఈ దత్తపుత్రుడు.. వారే పొత్తులు పెట్టుకొని, వారే తెగదెంపులు చేసుకుంటారు. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకుని, విడిపోయారు. వివాహం చేసుకునేదీ వీళ్లే, విడాకులు ఇచ్చేదీ వీళ్లే.. మళ్ళీ వివాహాలు చేసుకునేదీ వీళ్లే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీనికి పవన్ ఈ మేరకు ఓ పోస్టర్ న పోస్ట్ చేస్తూ రిటార్ట్ ఇచ్చారు.