విజయనగరంలో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు రాంబాబును అరెస్ట్ చేసినట్టుగా విజయనగరం ఎస్పీ తెలిపారు. రాంబాబు ప్రేమించిన యువతితోనే పెళ్లి నిశ్చయమైంది. అయితే పెళ్లి నిశ్చయమైన తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలే ఈ ఘటనకు కారణమయ్యాయని ఎస్పీ పాటిల్ చెప్పారు.
విజయనగరం: ప్రియురాలిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు రాంబాబును శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.ఇవాళ సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితుడిని ఎస్పీ దీపిక పాటిల్ ప్రవేశపెట్టారు. నిందితుడిని కృష్ణాపురంలో అరెస్ట్ చేశామన్నారు.
also read:విజయనగరంలో ప్రియురాలికి నిప్పు... దిశ యాప్ వల్లే యువతిని కాపాడాం: మంత్రి శ్రీవాణి (వీడియో)
ఇద్దరి మధ్య వివాహం కుదిరిన తర్వాత చోటు చేసుకొన్న అనుమానాలే ఈ ఘటనకు కారణమయ్యాయని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో మరికొందరు అనుమానితులను కూడా విచారించాల్సిన అవసరం ఉందని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై బాధితులకు సకాలంలో వైద్య అందించడంలో దిశ యాప్ కీలకపాత్ర పోషిస్తోందని ఎస్పీ చెప్పారు. దాడిని అడ్డుకోబోయిన వారికి కూడ గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. బాధితురాలికి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ వివరించారు.
