Asianet News TeluguAsianet News Telugu

మంత్రి వేణు వర్గీయుల దాడి: రామచంద్రాపురం మున్సిపల్ వైఎస్ చైర్ పర్సన్ శివాజీ ఆత్మహత్యాయత్నం

రామచంద్రాపురం మున్సిపల్ వైఎస్ చైర్ పర్సన్ శివాజీ ఆత్మహత్యాయత్నం  చేశారు. అతడికి  ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Ramachandrapuram  Municipal  Vice Chair Person  Sivaji  Suicide attempt lns
Author
First Published Jul 17, 2023, 3:21 PM IST

రామచంద్రాపురం:  రామచంద్రాపురం  మున్సిపల్ వైఎస్ చైర్ పర్సన్  శివాజీ ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే అతడిని  రామచంద్రాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు  ఆదివారంనాడు నిర్వహించిన సమావేశానికి  రామచంద్రాపురం మున్సిపల్ వైఎస్ చైర్మెన్ హాజరయ్యారు. అయితే  ఇవాళ  రామచంద్రాపురంలోని  17వ వార్డులో నిర్వహించిన  సురక్ష కార్యక్రమానికి  శివాజీ హాజరయ్యారు.  నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమానికి హాజరై  ఇవాళ  మంత్రి పాల్గొనే  సురక్ష కార్యక్రమానికి ఎందుకు హాజరయ్యావని  మంత్రి వేణు వర్గీయులు  శివాజీపై  దాడికి దిగారని  పిల్లి సుభాష్ చంద్రబోస్  వర్గీయులు ఆరోపిస్తున్నారు.ఈ దాడితో  మనోవేదనకు  గురైన  శివాజీ ఆత్మాహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన  పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు అతడిని ఆసుపత్రికి తరలించారు. శివాజీకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే  ఈ విషయమై పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయుల ఆరోపణలను మంత్రి చెల్లుబోయిన వేణు వర్గీయులు ఖండిస్తున్నారు.

రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో  పిల్లి సుభాష్ చంద్రబోస్  తనయుడు  పిల్లి సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని  ఆయన వర్గం భావిస్తుంది. ఇదే విషయమై  పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు  నిన్న నిర్వహించిన సమావేశంలో తీర్మానం కూడ చేశారు.

2019  అసెంబ్లీ ఎన్నికల్లో  రామచంద్రాపురం అసెంబ్లీ స్థానం నుండి చెల్లుబోయిన వేణుగోపాల్ కు  వైఎస్ఆర్ సీపీ టిక్కెట్ దక్కింది.  మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు  మండపేట అసెంబ్లీ స్థానం నుండి జగన్ టిక్కెట్టు ఇచ్చారు.  అయితే  రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుగోపాల్ విజయం సాధించారు. మండపేట నుండి పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో  పిల్లి సుభాష్ చంద్రబోస్ ను  ఎమ్మెల్సీని చేసి  తన మంత్రివర్గంలోకి తీసుకున్నాడు జగన్. అయితే  సామాజిక సమీకరణాల నేపథ్యం, పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని  పిల్లి సుభాష్ చంద్రబోస్ ను మంత్రివర్గం నుండి తప్పించారు.  ఆయనను రాజ్యసభకు  పంపారు జగన్, 

also read:అందరి చూపు ఆ మీటింగ్ పైనే: నేడు పిల్లి వర్గీయుల బీసీ మీటింగ్, హాజరు కానున్న మల్లాడి

టీడీపీ నుండి  వైఎస్ఆర్‌సీపీలో చేరిన తోట త్రిమూర్తులుకు  మండపేట వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు సీఎం జగన్. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  రామచంద్రాపురం నుండి  తన కొడుకు  సూర్యప్రకాష్ ను బరిలోకి దింపాలని  పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆసక్తిగా ఉన్నారు. ఈ పరిణామాల్లో  సుభాష్ చంద్రబోస్ సమావేశానికి హాజరైన శివాజీపై  మంత్రి వేణు వర్గీయులు దాడి చేశారని  ఆరోపణలు చేస్తున్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు. దీంతో మనోవేదనకు  గురైన శివాజీ ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఆత్మహత్యలు పరిష్కారం కావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios