బాబాయ్ చిటిక వేస్తే చాలు వెళ్లిపోతా: రాంచరణ్ (వీడియో)

ram charan comments on janasena party
Highlights

బాబాయ్ చిటిక వేస్తే చాలు వెళ్లిపోతా: రాంచరణ్ (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన కుటుంబం నుంచి మద్దతు పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి కుటుంబంతో విభేదాలున్నాయని అందువల్లే జనసేన పార్టీ తరపున మెగా ప్యామిలీ సభ్యులు ఎవరూ మాట్లాడటం లేదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మెగాస్టాన్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ బాబాయ్ తరపున ప్రచారానికి సిద్దమని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

బాబాయ్ అనుమతిస్తే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి తాసు సిద్దమని హీరో  రాంచరణ్ ప్రకటించారు. పార్టీ కోసం, ప్రజల కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడుతున్నారని అన్నారు.  గతంలోనే తాను ప్రజార్యాజ్యం పార్టీ ప్రచారం చేస్తానంటే బాబాయ్ వద్దన్నాడని కానీ ఇపుడు జనసేన తరపున తరపున ప్రచారానికి తాసు సిద్దమని రాంచరణ్ ప్రకటించారు.

                 

loader