రాజమండ్రి సెంట్రల్ జైలులోగా రిమాండ్ ఖైదీ ఉన్న వ్యక్తి మృతి.. జైళ్ల శాఖ రియాక్షన్ ఇదే..
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తి మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై జైళ్ల శాఖ డీఐజీ స్పందించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సత్యనారాయణ అనే వ్యక్తి మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. ఇందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ చంద్రబాబు నాయకుడు కూడా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందిన నేపథ్యంలో.. టీడీపీ శ్రేణులు రాజమండ్రి జైలులో చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల వేళ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీ మృతిపై.. కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు.
దోపిడి కేసులో సత్యనారాయణను ఈ నెల 6న రిమాండ్‌కు తీసుకొచ్చినట్టుగా చెప్పారు. అయితే జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ఈ నెల 7వ తేదీన ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. డెంగ్యూతో బాధపడుతూ సత్యనారాయణ మృతిచెందాడని వెల్లడించారు. జైలులో దోమల లార్వా అనవాళ్లు ఏమి లేవని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 2వేలకు పైగా ఖైదీలు ఉన్నారని చెప్పారు. జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అయితే ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ దోపిడీ కేసుకు సంబంధించి ఈ నెల 6 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై బుధవారం మరణించాడు. అయితే ఈ వార్త తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపే కుట్రలు జరుగుతున్నాయని ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ ఆరోపించారు.
ఎలాంటి ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలమ్ మెంట్ కేసులో ప్రధాన సూత్రదారి అంటూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని... బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని లోకేష్ అన్నారు. సైకో జగన్ ఇదంతా చేస్తోంది ప్రతిపక్ష నాయకున్ని చంపేందుకే అన్న అనమానాలు రోజురోజుకు మరింత బలపడుతున్నాయని అన్నారు. జైల్లో పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని లోకేష్ అన్నారు.
న్యాయస్థానం చంద్రబాబుకు జైల్లో కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించిందని.. కానీ ప్రభుత్వం, జైలు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. బయట జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో చంద్రబాబు ఉంటారు కాబట్టి ఏం చేయలేరు.. అందువల్లే జైల్లో హాని తలపెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. జైల్లో ఉన్న చంద్రబాబు విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెబుతున్నా జైలు అధకారులు పట్టించుకోవడం లేదని లోకేష్ అన్నారు. ఇ
లా గతంలో రిమాండ్ ఖైదీగా జైల్లో వున్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ దోమలు కుట్టడంతో డెంగ్యూ బారినపడ్డాడని.. దీంతో అతడి పరిస్థితి విషమించి మరణించాడని గుర్తుచేశారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు ఏం జరిగిని సైకో సీఎం జగన్ బాధ్యత వహించాలని లోకేష్ అన్నారు.