రాజమండ్రి:ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన అంశాన్ని ఏపీ ప్రభుత్వ పోర్టల్‌లో ఎందుకు  పెట్టలేదని రాజమండ్రి  మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు.

మంగళవారంనాడు ఆయన రాజమండ్రిలో  మీడియాతో మాట్లాడారు.  జీరో బడ్జెట్ పేరిట నేచురల్‌ ఫార్మింగ్‌ గురించి వివరించి, రూ.16 వేల 600 కోట్ల ఎంవోయూను చంద్రబాబు, సిఫ్‌ సంస్థతో ఎందుకు ఆయన ప్రశ్నించారు.

దేశ వ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం ఏపీకే వచ్చినట్టు బాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి రైతులను పోలవరం ప్రాజెక్టును చూపించేందుకు  తీసుకెళ్లడానికి రూ.20 కోట్లు ఖర్చు చేయడం దారుణమన్నారు. 

 ఈ మొత్తం వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు  కుటుంబరావు స్పందించాలని కోరారు. ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్‌ రైతు సాధికార సంస్థను ప్రశ్నిస్తే ఆర్టీఐలోని సెక్షన్‌ 8 ప్రకారం వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారని వెల్లడించారు.