రాజమండ్రి సిటీలోనూ టీడీపీదే హవా.. ఆదిరెడ్డి వాసు విజయం
Rajahmundry City assembly elections result 2024 live : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో అధికార వైసిపి... ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమిలు మంచి పోటీ పడ్డాయి. కానీ ప్స్తురతం రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం టిడిపి చేతిలో వుంది.. ఇంకేముందు అనుకున్నట్టే ఇక్కడ టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు.
Rajahmundry City assembly elections result 2024 live : రాజమండ్రి రాజకీయాలు :
రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. అలాగే ఇక్కడ గతంలో బిజెపికి కూడా ప్రాతినిధ్యం వుంది. టిడిపి నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (1983,1985, 1994, 1999) నాలుగుసార్లు, బిజెపి నుండి ఆకుల సత్యనారాయణ (2014) నుండి రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేసారు. ప్రస్తుతం (2019) ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా ఇప్పటికే రాజమండ్రి సిటీలో బలంగా వున్న టిడిపికి జనసేన, బిజెపి పొత్తు మరింత బూస్ట్ ఇచ్చింది. రాజమండ్రి లాంటి పట్టణ ప్రాంతాల్లో బిజెపి ప్రభావం, ప్రధాని మోదీ చరిష్మా కలిసివస్తుందని టిడిపి ఆశించింది. అనుకున్నట్టే టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు మంచి విజయం సాధించాడు.
ఇక రాజమండ్రి సిటీలో వైసిపి ఇప్పటివరకు విజయం సాధించిందీ లేదు. కానీ ఈసారి ఎలాగైన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలదో వైసిపీ జోరుగా ప్రచారం చేసింది. ఈ పార్టీ ఇక్కడి నుంచి రాజమండ్రి సిట్టింగ్ ఎంపీని బరిలోకి దింపి ఓటమి పాలయ్యింది.
రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. రాజమండ్రి అర్బన్ మండలం (రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 7 నుండి 35, 42 నుండి 89 వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి)
రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,53,184
పురుషులు - 1,22,373
మహిళలు - 1,30,748
రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
రాజమండ్రి సిటీ వైసిపి అభ్యర్థిగా మార్గాని భరత్ ను నిలబెట్టింది. రాజమండ్రి ఎంపీగా వున్న ఆయనను అసెంబ్లీ పోటీలో నిలిపింది వైసిపి అధిష్టానం
టిడిపి అభ్యర్థి :
రాజమండ్రి సిటీ టిడిపి అభ్యర్థిగా ఆధిరెడ్డి వాసును ఎంపిక చేశారు అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే భవాని భర్త ఈ వాసు (దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కూతురే ఆదిరెడ్డి భవాని)
రాజమండ్రి సిటటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు - 1,67,604 (66 శాతం)
టిడిపి - ఆదిరెడ్డి భవాని - 83,702 (49 శాతం) -30,065 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - రౌతు సూర్యప్రకాశ్ రావు - 53,637 (32 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - అత్తి సత్యనారాయణ - 23,096
(13 శాతం)
రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,58,317 (68 శాతం)
బిజెపి - ఆకుల సత్యనారాయణ - 79,531 (50 శాతం) - 26,377 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - బొమ్మన రాజ్ కుమార్ - 53,154 (33 శాతం) - ఓటమి
రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలు
రాజమండ్రి సిటీలో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు విజయం సాధించారు. ఈయన 65,400 ఓట్లతో ఆదిరెడ్డి వాసు గెలుపొందాడు.
- Adireddy Bhavani
- Adireddy Vasu
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Elections 2024
- JSP
- Janasena Party
- Margani Bharat
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- Rahahmundry Politics
- Rajahmundry City assembly elections result 2024
- TDP
- TDP Janasena Alliance
- Telugu Desam party
- Telugu News
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP