ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 లో అధికార వైసిపి... ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి అమీతుమీకి సిద్దమయ్యాయి. ప్రస్తుతం రాజమండ్రి సిటీ అసెంబ్లీ స్థానం టిడిపి చేతిలో వుంది... ఈ  సీటును తిరిగా కాపాడుకోడానికి పసుపు పార్టీ వ్యూహాలు రచించింది. ఇక ఈసారి 175 కు 175 అసెంబ్లీ సీట్లు తమవేఅంటున్న వైసిపి రాజమండ్రి సిటీ బరిలో బలమైన అభ్యర్థిని నిలిపింది. ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజమండ్రి సిటీలో గెలుపుకోసం పొలిటికల్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. అయితే రాజమండ్రి సిటీ ఓటర్లు ఏ పార్టీకి మద్దతిచ్చారో ఎన్నికల పలితాలే తేల్చనున్నాయి. 

రాజమండ్రి రాజకీయాలు : 

రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. అలాగే ఇక్కడ గతంలో బిజెపికి కూడా ప్రాతినిధ్యం వుంది. టిడిపి నుండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (1983,1985, 1994, 1999) నాలుగుసార్లు, బిజెపి నుండి ఆకుల సత్యనారాయణ (2014) నుండి రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేసారు. ప్రస్తుతం (2019) ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా ఇప్పటికే రాజమండ్రి సిటీలో బలంగా వున్న టిడిపికి జనసేన, బిజెపి పొత్తు మరింత బూస్ట్ ఇవ్వనుంది. రాజమండ్రి లాంటి పట్టణ ప్రాంతాల్లో బిజెపి ప్రభావం, ప్రధాని మోదీ చరిష్మా కలిసివస్తుందని టిడిపి ఆశిస్తోంది.

ఇక రాజమండ్రి సిటీలో వైసిపి ఇప్పటివరకు విజయం సాధించింది లేదు. కానీ ఈసారి ఎలాగైన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలదో వైసిపి వుంది. అందులో భాగంగానే రాజమండ్రి సిట్టింగ్ ఎంపీని ఇక్కడినుండి బరిలోకి దింపుతోంది.


రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. రాజమండ్రి అర్బన్ మండలం (రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 7 నుండి 35, 42 నుండి 89 వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి) 


రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,53,184
పురుషులు - 1,22,373
మహిళలు ‌- 1,30,748

రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

రాజమండ్రి సిటీ వైసిపి అభ్యర్థిగా మార్గాని భరత్ ను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీగా వున్న ఆయనను అసెంబ్లీ పోటీలో నిలిపింది వైసిపి అధిష్టానం 

 టిడిపి అభ్యర్థి : 

రాజమండ్రి సిటీ టిడిపి అభ్యర్థిగా ఆధిరెడ్డి వాసును ఎంపికచేసారు అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుత రాజమండ్రి ఎమ్మెల్యే భవాని భర్త ఈ వాసు (దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కూతురే ఆదిరెడ్డి భవాని)

రాజమండ్రి సిటటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు ‌- 1,67,604 (66 శాతం)

టిడిపి - ఆదిరెడ్డి భవాని - 83,702 (49 శాతం) -30,065 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - రౌతు సూర్యప్రకాశ్ రావు - 53,637 (32 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - అత్తి సత్యనారాయణ - 23,096
(13 శాతం)

రాజమండ్రి సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,58,317 (68 శాతం)

బిజెపి - ఆకుల సత్యనారాయణ - 79,531 (50 శాతం) - 26,377 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - బొమ్మన రాజ్ కుమార్ - 53,154 (33 శాతం) - ఓటమి