Raj Kasireddy Arrested: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అలియాస్‌ రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారని సమాచారం. అయితే... రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే రెండు ఆడియోలను విడదల చేశారు. దీంతోపాటు పోలీసుల విచారణకు హాజరు కాకుండా.. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అలియాస్‌ రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారని సమాచారం. అయితే... రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే రెండు ఆడియోలను విడదల చేశారు. దీంతోపాటు పోలీసుల విచారణకు హాజరు కాకుండా.. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసులు పట్టుకున్నారా.. లొంగిపోయాడా? 
రాజ్ కసిరెడ్డి ఏప్రిల్‌ 21న రెండో ఆడియో విడుదల చేశారు. దీనిలో తాను సిట్‌ విచారణకు హాజరవుతానని తెలిపాడు. మంగళవారం వస్తానని అన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని రోజులు దుబాయ్‌ పారిపోయి అక్కడే తన దాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. అతను ముందే చెప్పినట్లు లొంగిపోయాడా లేదా పోలీసులు పట్టుకున్నారా అన్నది స్పష్టత రాలేదు. కానీ పోలీసులు మాత్రం అతన్ని హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. కసిరెడ్డిని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పోలీసులు తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి సిట్‌ అధికారులు ఆయన్ని విచారించనున్నారు. 

మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు.. 
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా రాజ్ కసిరెడ్డి ఉన్నాడు. ఇతని నేతృత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపీ మిధున్‌ రెడ్డి తదితరులు కలిసి అర్హత లేని, రిజిస్ట్రేషన్‌ లేని మద్యం తయారీ కంపెనీల నుంచి నాసిరకం మద్యం కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కేవలం 20 శాతం లిస్టెడ్‌ కంపెనీలు, 80 శాతం వరకు నాన్‌ లిస్టెడ్‌ కంపెనీల నుంచి ఏపీకి మద్యం వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని వెనుక రాజ్ కసిరెడ్డి పాత్ర క్రియాశీలకంగా ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. అయితే.. అతను అధృశ్యం కావడంతో.. కేసుకు సంబంధించిన ఇద్దరు ఎంపీలను పిలిచి విచారించారు. 

తీగ లాగితే డొంక కదులుతుందా.. 
మద్యం కుంభకోణం విషయంలో తీగ లాగితే డొంక కదిలేలా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎంపీ విజయసాయి రెడ్డి నుంచి పలు కీలక విషయాలను అధికారులు సేకరించారు. మద్యం కుంభకోణంలో సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని ఆయన మీడియా ముందు వెల్లడించారు. వాళ్లు తనను బ్యాంకు లోన్‌ అడిగారని వడ్డీ కింద రూ.100కోట్లు వ్యాపారం కోసం కసిరెడ్డికి ఇప్పించినట్లు తెలిపారు సాయిరెడ్డి. తన పాత్ర ఇంతవరకే అని అన్నారు. ఇక బిగ్‌బాస్‌ జగన్‌ పాత్ర ఏమైనా ఉందా అని అడగ్గా.. నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు. ఎంపీ మిధున్‌ రెడ్డి కూడా తనకు ఈ కుంభకోణానికి సంబంధం లేదని అన్నారు. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి నుంచి పోలీసులు ఏ మేరకు సమాచారం సేకరిస్తారు, కుంభకోణం వెనుక ఉన్న బిగ్‌ షాట్స్‌ పాత్రను బయటకు తీస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.