Asianet News TeluguAsianet News Telugu

వాయు గుండం ఎఫెక్ట్:ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, విద్యా సంస్థలకు నేడు సెలవు


వాయు గుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  పలు కాలనీలు నీటిలోనే మునిగాయి. వర్ష ప్రభావంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవుు ప్రకటించింది.

Rains Lash Many Districts of Andhra Pradesh
Author
Guntur, First Published Nov 12, 2021, 9:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి:  వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా వర్షం నీరు చేరింది. మరోవైపు  నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై  వరద నీరు ప్రవహిస్తుండడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏపీ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో  భారీ వర్షాలు కురిశాయి. మరో వైపు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది.చిత్తూరు జిల్లాలో  భీమా, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.swarnamukhi నది ఉప్పొంగడంతో Tirupati-చంద్రగిరి మధ్య రాకపోకలు  నిలిచిపోయాయి.ముక్కోటి రోడ్డుపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు ప్రవహిస్తోంది.నాగయ్యగారిపల్లి వద్ద  వంతెన కొట్టుకుపోయింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Kadapa జిల్లా రోయచోటి, రాజంపేటల్లో  రెండు రోజులుగా  Heavy Rains కురుస్తుంది.  వర్ష ప్రభావిత ప్రాంతాల్లో  వరి, వేరుశనగ,బొప్పాయి. అరటి పంటలకు  నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో కాళంగి డ్యామ్ గేట్లు ఎత్తివేశారు. సూళ్లూరుపేట  వద్ద గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు టెంపుల్ సిటీ తిరుపతిలో గురువారం నాడు భారీ వర్షం కురిసింది. దీంతో  పలు కాలనీలు  నీటిలోనే ఉన్నాయి.  

also read:తీరాన్ని దాటిన వాయుగుండం: విరిగిపడిన చెట్లు, వరదనీటితో భయానకం, చెన్నైకి విమానాల నిలిపివేత

రాష్ట్రంలో భారీ వర్షాల పరిస్థితిపై ఏపీ సీఎం Ys Jagan గురువారం నాడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.Ndrf, Sdfr బృందాలను చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పంపారు. ఇవాళ కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  అధికారులు కోరారు. మరో వైపు బంగాళాఖాతంలో  మరో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు దక్షఇణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

తిరుపతి పట్టణంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షంలోనే భక్తులు వెంకన్నను దర్శనం చేసుకొన్నారు.  అయితే గురువారం నాడు ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున వాహనాలను అనుమతించలేదు. శుక్రవారం నాడు ఉదయం నుండి ఘాట్ రోడ్డుపై ప్రయాణించేందుకు అధికారులు అనుమతించారు.తిరుపతి అర్బన్ పోలీసులు, రెవిన్యూ అధికారులు, ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు వర్ష పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లతో నీటిని తోడి బయటకు పంపిస్తున్నారు.భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని తూర్పు, పడమర ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కన్పించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios