Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రకీలాద్రిపై తప్పిన పెను ప్రమాదం.. భక్తుల పరుగులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. అమ్మవారి ఆలయ ఆవరణలో వున్న రావిచెట్టుకు మొక్కులు కట్టే క్రమంలో రావి చెట్డు కొమ్మలు పెద్ద శబ్దంతో ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు, భవానీలు పరుగులు పెట్టారు.

rain effect in vijayawada indrakeeladri
Author
First Published Oct 6, 2022, 2:46 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తప్పింది. బుధవారం నుండి బెజవాడలో ఎడతెగని వర్షం కురుస్తోంది. వర్షందాటికి గురువారం అమ్మవారి సన్నిధిలోని రావి చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. నిన్నటి నుండి అమ్మవారి దర్శనానికి వేలాది మంది భవానీలు పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయం నుండి బయటకి వచ్చి ధ్వజస్తంభానికి  , రావిచెట్టుకు మొక్కులు కట్టడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ క్రమంలో గురువారం రావిచెట్టుకు మొక్కులు కట్టే క్రమంలో రావి చెట్డు కొమ్మలు పెద్ద శబ్దంతో ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు, భవానీలు పరుగులు పెట్టారు. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. 

ALso REad:జోరువానలో విజయవాడ దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు

కాగా... శరన్నవరాత్రి వేడుకల్లో చివరి రోజయిన బుధవారం విజయవాడ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. దసరా పండగ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు, భవాని దీక్షదారులు భారీగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు నిండిపోయి అమ్మవారి దర్శనానికి సమయం పడుతోంది. నవరాత్రి వేడుకల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. ఈ క్రమంలో నిన్న ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులు అమ్మవారిని దర్శించుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios