ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైల్వే ఏఎస్సైగా పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది.
కావలి : Family disputesతో రైల్వే ఏఎస్సై భార్యఅనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా Kavaliలో మంగళవారం అర్థరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పు పాలానికి చెందిన చిక్కా నరసింహారావుకు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోలవరానికి దుర్గ భవాని (29) తో పదేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసింహారావు ఉద్యోగరీత్యా కొన్నాళ్ల కిందట కావలి వచ్చాడు. పట్టణంలోని రామ్మూర్తి పేటలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం జరిగింది.
దీంతో మనస్తాపంతో ఆమె ఉరి వేసుకుందని.. ఏఎస్సై నరసింహారావు చెబుతుండగా.. suicide కాదని చంపేశారని దుర్గాభవాని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. Extra dowry కోసం అత్తమామలు వేధిస్తున్నారన్నారు. తట్టుకోలేక గతంలో రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందన్నారు. ముందు రోజు రాత్రి కూడా videocalలో మాట్లాడిందని విలపిస్తూ చెప్పారు. వేధింపులు అధికం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వాపోయారు. కావాలి ఒకటో పట్టణ సీఐ కె.శ్రీనివాస్, ఎస్సై మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఇదిలా ఉండగా, నిరుడు ఆగస్ట్ లో కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో ఎస్సైగా పనిచేస్తున్న పెనుకొండ రవికుమార్ భార్య ప్రసూన (35) ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన జరిగిన వెంటనే ఆమెను కడపలోని హోలిస్టిక్ ఆస్పత్రిలో వైద్య సేవల కోసం చేర్పించారు. మరుసటి రోజు తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ సంఘటనపై మృతురాలి తండ్రి గైక్వాడ్ వీరోజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ ఎస్ఐజి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన పెనుగొండ రవి కుమార్ కు, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన గైక్వాడ్ వీరోజీరావు కుమార్తె ప్రసూనకు 2011లో వివాహమైంది. 2012 బ్యాచ్ కు చెందిన రవికుమార్ శిక్షణను పూర్తి చేసుకుని 2014 ప్రారంభంలో ఎస్సైగా విధుల్లో చేరారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. జైన శ్రీపాద (8), స్పోహిత (6) ఉన్నారు. వీరు ప్రస్తుతం కడపలోని ఓం శాంతి నగర్ లో ఉంటున్నారు.
రవికుమార్ ప్రస్తుతం కడపలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో ఎస్‌ఐగా విధులను నిర్వహిస్తున్నారు. ప్రసూన అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధ పడేదని, ఆస్పత్రులకు తిరిగేవారమని ఆమె తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్ట్ నెల 8వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక బెడ్ రూమ్ లో ఎస్ ఐ రవి కుమార్ ఉండగా, మరో బెడ్ రూమ్ లోకి ప్రసూన వెళ్ళింది. తలుపు గడియ పెట్టుకుంది. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో రవికుమార్ బెడ్రూమ్ వద్దకు వెళ్లి పిలిచాడు. పలకకపోవడంతో తలుపులు బద్దలు కొట్టాడు.
వెళ్లి చూడగా, ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే కిందికి దించి ప్రధమ చికిత్స చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ ఆమె సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతదేహానికి రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
