రాహుల్ గాంధీ పర్యటనలో పలుచోట్ల తనను అనుమతించకుండా అవమాన పరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ హనుమంతారావు అలక పూనారు. 

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలపరచాలనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యటన చేపట్టారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జిల్లాలో ఉన్నారు.

 కాగా..రాహుల్ గాంధీ పర్యటనలో పలుచోట్ల తనను అనుమతించకుండా అవమాన పరిచారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ హనుమంతారావు అలక పూనారు. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటన సందర్భంగా వీహెచ్ అక్కడికి వెళ్లారు. అయితే ఆయనను కిసాన్ ఘాట్‌లోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా పలుచోట్ల తనను అవమానించే విధంగా అడ్డుకున్నారని వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.