ఏపీలోకి భారత్ జోడో యాత్ర:కర్నూల్ లో నాలుగు రోజుల పాటు రాహుల్ పాదయాత్ర
భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఇవాళ ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు యాత్ర సాగనుంది. కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో ఈ యాత్ర సాగుతుంది. నాలుగు రోజుల్లో 119కి.మీ దూరం రాహుల్ యాత్ర నిర్వహిస్తారు.
కర్నూల్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నభారత్ జోడో యాత్ర మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది.నాలుగు రోజుల పాటు ఈ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్ర నాలుగు రోజుల పాటు సాగుతుంది. నాలుగు రోజుల్లో 119 కి.మీ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తారు.
ఈ నెల 14న కర్ణాటక నుండి ఓబులాపురం మీదుగా ఏపీలోకి ప్రవేశించింది. 11వతేదీన రాహుల్ గాంధీ 18 కి.మీ పాదయాత్ర నిర్వహించారు.కర్ణాటక ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులోని ఢి,హీరేలాల్ మండలంలోని పలు గ్రామాల గుండా పాదయాత్ర నిర్వహిస్తూ కర్ణాటకలోకి రాహుల్ వెళ్లారు. ఇవాళ ఏపీ రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రవేశించింది.నాలుగు రోజుల తర్వాత రాహుల్ పాదయాత్ర మళ్లీ కర్ణాటక రాష్ట్రంలో ప్రవేశించనుంది. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు జిల్లాలో ఈ యాత్ర సాగనుంది. రాయిచూరు నుండి ఈ నెల23న రాహుల్ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుంది.
కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోని చేత్రగుడి రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పోలవరం నిర్వాసితులు ,అమరావతి రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
aloread:ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర:రాహుల్ కు స్వాగతం పలికిన రఘువీరారెడ్డి
జిల్లాలోని ఆలూరు,ఆదోని,ఎమ్మిగనూరు,మంత్రాలయం నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగుతుంది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ,నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ గాంధీ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.
2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర విభజనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.మెజారిటీ నేతలు కాంగ్రెస్ ను వీడారు. కొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరితే మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ యాత్ర దోహదపడనుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు.
ఈ నెల 23న రాయిచూరు నుండి తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం గుండా భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్ర ప్రవేశించిన రోజున మధ్యాహ్నం వరకు రాహుల్ యాత్ర కొనసాగిస్తారు. ఈ నెల24 నుండి 26వ తేదీ వరరకు యాత్రకు విరామం ఇస్తారు. దీపావళిని పురస్కరించుకొని ఈ యాత్రకు రాహుల్ విరామం ఇవ్వనున్నారు.ఈ నెల 27 నుండి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ నెల 4,5 తేదీల్లో దసరాను పురస్కరించుకొని పాదయాత్రకు రాహుల్ గాంధీ విరామం ఇచ్చిన విషయం తెలిసిందే.తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది.