Asianet News TeluguAsianet News Telugu

ఏపీలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర:రాహుల్ కు స్వాగతం పలికిన రఘువీరారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ ప్రవేశించింది.  ఏపీలో ఇవాళ పాక్షికంగా రాాహుల్ యాత్ర సాగుతుంది.ఈ నెల 18వ తేదీ నుండి యాత్ర ఏపీలో ప్రవేశించనుంది.

Rahul Gandhi Bharat Jodo Yatra Enters Into  Andhra pradesh
Author
First Published Oct 14, 2022, 10:52 AM IST

అనంతపురం: సత్యసాయి జిల్లాలోని  ఓబులాపురం  నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం నాడు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. .ఇవాళ 12 కి.మీ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగనుంది.ఈ నెల 18వ  తేదీ నుండి  రాహుల్ గాంధీ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగనుంది. 

కర్ణాటక రాష్ట్రంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర సాగుతుంది.  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో రాహుల్ యాత్ర ఇవాళ ఉదయం ప్రారంభమైంది.  సత్యసాయి జిల్లాలోని ఓబులాపురం నుండి రాహుల్ పాదయాత్ర ఏపీలోకి  ప్రవేశించింది. డి.హిరేలాల్ మండలంలో యాత్ర సాగుతుంది.ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర పాక్షికంగానే కొనసాగనుంది.  ఈ నెల18వతేదీ నుండి రాహుల్ యాత్ర ఏపీలో కొనసాగనుంది. 

also read:భారత్ జోడో యాత్రకు ప్రచారం ఏది .. నీకైతే పబ్లిసిటీ కావాలా : రేవంత్‌పై కేసీ వేణుగోపాల్ అసహనం

ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, తులసీరెడ్డి వంటి నేతలు రాహుల్ యాత్రకు ఘనంగా స్వాగతం  పలికారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.  రాజీకీయాలకు మూడేళ్లుగా రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నారు. తన స్వగ్రామం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం వంటి కార్యక్రమాలకే  రఘువీరారెడ్డి పరిమతమయ్యారు.

భారత్ జోడో పాదయాత్ర అనంతపురంజిల్లా మీదుగా సాగుతున్న  నేపథ్యంలో ఈయాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డిని కోరారు.  ఈ యాత్ర ఏర్పాట్లపై  కర్నూల్ లో గత మాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి  రావాలని కూడా రఘువీరారెడ్డిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి మాత్రం ఆయన హాజరు కాలేదు. కానీ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలనే తన గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన రఘువీరారెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటానని ప్రకటించారు. కానీ  రాజకీయాలకు మాత్రం సెలవేనని ఆయన తేల్చి చెప్పారు.

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర 12 కి.మీ. సాగుతుంది.  డి.హీరేలాల్ మండలం కనుకుప్ప గ్రామం గుండా రాహుల్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, డి.హీరేలాల్,ఓబులాపురంచెక్ పోస్టు మీదుగా పాదయాత్ర సాగనుంది.ఏపీ గుండా కర్ణాటక రాష్ట్రంలోకి యాత్ర వెళ్తుంది.ఈ నెల 18వ తేదీ నుండి కర్ణాటక  నుండి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశించనుంది. 

ఈ ఏడాది సెప్టెంబర్ 30న భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్టరంలోకి ప్రవేశించింది. 21 రోజుల పాటు  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పాదయాత్ర సాగనుంది.  ఈ నెల 4,5 తేదీల్లో రాహుల్ గాంధీ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.ఈ నెల 6న  రాహుల్ గాంధీ  పాదయాత్ర సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది.  తమిళనాడు, కేరళ మీదుగా ఈ యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది.  కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నారు.దేశంలోని 3,570  కి.మీ పాటు యాత్ర సాగనుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios