పార్టీ మారుడుపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ రఘువీరా

Raghuveera Reddy clarifies reports appeard im=n media
Highlights

టిడిపి, వైసిపి రెండూ బిజెపి గూటిలో ఉన్నవే

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి పార్టీ మారతాడంటూ ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. దీంతో ఈ అంశంపై రఘువీరా విజయవాడలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో రఘువీరా పాల్గొని మాట్లాడారు. నా ప్రాణము ఉన్నంత వరకు కాంగ్రేసు పార్టీ లోనే ఉంటాను అని స్పష్టం చేశారు. మరిన్ని అంశాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు  రఘువీరా సమాధానాలు, రఘువీరా స్పీచ్ కూడా..

నాలుగు సంవత్సరాల క్రితం బిజెపి ప్రధాని మే 14. న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ లను అమలు చేయాలని..కేంద్ర మంత్రులను కోరాము. సోనియా గాంధీ ప్రతిపక్షం లోకి వచ్చిన తరువాత మొదటి లేఖ రాశారు.విభజన హామీ లను అమలు చేయాలని. కోటి.సంతకాలు.ఉద్యమం. కోటి మేసెజ్ కు.మట్టి సేకరణ వంటి పలు ఉద్యమాలు చేశాము. బిజెపి ఎపికి తీరని ద్రోహం చేసింది. ఈరోజు అందరు ప్రత్యేక హాదా మాట్లాడుతున్నారు.

జూన్ 8న ఎపి సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. మే 31 న గవర్నర్ ను కలిశాను రైతులకు రుణమాఫీ చేయాలని. బ్యాంకు లలో లోన్లు ఇవ్వడం లేదు అ సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని కోరాము. నాలుగు సంవత్సరాల నుండి ప్రజల పక్షాన ఉద్యమాలు చేశాము. నోట్ల రద్దు అనేది ఒక ఉగ్రవాదులు చేసే చర్య. ఈ సమస్య ఇంకా కొనసాగుతుంది. ఎటిఎంలో డబ్బులు లేవు. నకిలీ కరెన్సీ అర్బీఐ.కి చేరింది. జిఎస్టీ తలతోకలేని జీఎస్టీ.. నల్లదనం వందరోజులలో తెస్తామన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల వేస్తామన్నారు‌ నేటికీ లేదు. మహానాడులో ఆరు వందల హామీ లను అమలు చేశామని నిసీగ్గు గా ప్రకటనలు చేశారు. ఆరువందల హామీ లలో ఆరు నూటికి నూరుపాళ్ళు అమలు అయిన్నాయా. అవినీతి లో ఏపి నెంబర్ వన్ లో ఉంది.ప్రతిచోట అవినీతి. బిజెపి యుద్ధవిమానాలలో కూడా అవినీతి కి పాల్పడింది. 2013  లో బిజెపి భాగస్వామి. ప్రతిపక్షం శూన్యం అయిపోయింది. వైసిపి వారు బిజెపి రోప్పులో పడిపోయారు. 2014 జూన్ లో ఎనిమిది ఎమ్మెల్సీ సీట్లు పెంచుకోవచ్చని సోనియా గాంధీ కోరారు. రాష్ట్ర పతి ఎన్నికలలో బేషరతుగా వైసిపి వారు మద్దతు ఇచ్చారు. అనాడు ప్రత్యేక హాదా గురించి మాట్లాడే తే హోదా వచ్చేది. టిడిపి. వైసీపీ భాజపా పక్షమే. బిజెపి నుండి బయటకు వచ్చిన తరువాత బిజెపి మంత్రి భార్యకు టిటిడి బోర్డు నెంబరు ఎలా ఇచ్చారు.

టిడిపి మహానాడు కాదు భోజనం నాడు నిర్వహించారు. .ఎపి కి మంచి లీడర్ ను ఇన్ చార్జ్ గా ఉమెద్ చంద్ ను నియమించారు. 1970 నుండి నేటికు ఓటమిలేని నాయకుడు ఆయన. 2019 ఎన్నికలలో మా పార్టీ అదికారంలోకి వస్తుంది. 84 వ ఫ్లీనరీలో తీసుకున్న నిర్ణయాలు.ప్రత్యేక హాదా గురించి తీర్మానం చేసింది. దేశంలో జరిగిన ఎన్నికలలో 13 చోట్ల గెలుపు దక్కింది. బిజెపి ఓటమి ఖారారు అయింది. 2019 లో కాంగ్రేసు పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. 2019 లో బిజెపి పార్టీ ని రానివ్వకూడదు అని మా పోరాటం. మాతో కలసి వచ్చే పార్టీ లతో కలసి ప్రయాణం చేస్తాము. చంద్రబాబు కర్నాటక లో రాహుల్ గాంధీ ని కలసిన దాంట్లో ఎవరికి తోచింది వారు చెప్పుతున్నారు. టిడిపి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టిడిపి అని గుర్తుంచుకోవాలి.

loader