Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని, రాష్ట్రపతికి ఏ1, ఏ2 ల లేఖ...దయ్యాలు వేదాలు వల్లించడమే: జగన్, విజయసాయిపై రఘురామ ఫైర్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి పై రెబల్ ఎంపీ రఘురామ మరోసారి ధ్వజమెత్తారు. ఏ1,ఏ2 లు తాను అక్రమాలకు పాల్పడ్డానని అనడం విడ్డూరంగా వుందన్నారు. 

raghurama krishnamraju fires on cm ys jagan, mp vijayasai reddy akp
Author
Amaravati, First Published Jul 25, 2021, 10:09 AM IST

న్యూడిల్లీ: సొంత పార్టీపైనే తిరుగుబాటుకు దిగిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రిపై జగన్, ఎంపి విజయసాయి రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. తనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి  ఫిర్యాదు చేస్తూ వైసీపీ ఎంపీలు రాసిన లేఖపై రఘురామ స్పందించారు. ఈ సందర్భంగానే ఏ1, ఏ2లు తాను అక్రమాలను పాల్పడ్డానని అనడం విడ్డూరంగా వుందన్నారు. 

''ఏ1, ఏ2లుగా పేరుపొందిన వారి గురించి చర్చించుకుందా. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల నేరచరితకు సాక్ష్యంగా 17 కేసులున్నాయి. వీరిపై చార్జీషీట్లు కూడా నమోదయ్యాయి. ఇలాంటివారు నేను బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టానని లేఖరాయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది'' అని విజయసాయి ఎద్దేవా చేశారు. 

read more  జగన్ అలా చేయరనుకున్నా.. కానీ ఎవరికీ తెలియకుండా అప్పులు: ఏపీ ఆర్ధిక స్థితిపై రఘురామ వ్యాఖ్యలు

''నా కంపెనీ బ్యాంకుకు సొమ్ములు ఎగ్గొట్టాయని... త్వరగా చర్యలు తీసుకోవాలని ఏ1, ఏ2 లు ప్రధాని, రాష్ట్రపతికి లేఖ రాశారు. రూ.43 వేల కోట్లు దోచారని అభియోగాలు ఎదుర్కొంటూ చార్జిషీట్లు కూడా దాఖలయిన నిందితులు నేను అక్రమాలకు పాల్పడ్డానని అనడం విడ్డూరంగా వుంది'' అని రఘురామ మండిపడ్డారు. 

గతంలో సిబిఐ జేడి లక్ష్మీనారాయణ దర్యాప్తులో జగన్ కు సంబంధించిన అక్రమాల గురించి చాలా తక్కువ బయటపడిందన్నారు. మిగతా అక్రమాలకు సంబంధించిన వివరాలను తాను ఇప్పటికే కోర్టుకు అందించినట్లు తెలిపారు. జగన్ లూటీ గురించి ప్రధాని, రాష్ట్రపతికి వివరిస్తానని రఘురామ వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios