Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ప్రధాని మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెస్తోందని, ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్డీసీకి బదిలీ చేసి మరి రుణాలు సేకరిస్తోందని తెలిపారు. 

raghurama krishnam raju wrote letter to modi - bsb
Author
Hyderabad, First Published Jun 16, 2021, 3:49 PM IST

ప్రధాని మోదీకి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెస్తోందని, ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్డీసీకి బదిలీ చేసి మరి రుణాలు సేకరిస్తోందని తెలిపారు. 

ఏపీఎస్డీసీ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని ఆయన లేఖలో వివరించారు. ఉచిత పథకాలకు మరో 3వలే కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులను సంప్రదిస్తోందని పేర్కొన్నారు. విశాఖలో కేటాయించిన భూములను దుబాయ్ కి చెందిన లులు సంస్థకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మీద ప్రధాని దృష్టి సారించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios