గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం నాడు రబ్బానీ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆటోలో వెళ్తున్న సమయంలో దుండగులు హత్యకు పాల్పడ్డారు.


 గుంటూరు: Guntur జిల్లా Tenali లో ఆదివారం నాడు ఉదయం Rabbani అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెనాలి-నంది వెలుగు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Autoలో వెళ్తున్న సమయంలో ప్రత్యర్ధులు ఆటోను అడ్డగించి రబ్బానీ అత్యంత దారుణంగా హత్య చేశారు. తెనాలి Railway Station కు సమీపంలో రబ్బానీ నివసిస్తున్నాడు. కొడుకుతో కలిసి ఇవాళ ఉదయం ఆటోలో రబ్బానీ Vijayawadaకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే రబ్బానీని ప్రత్యర్ధులు ఎందుకు హత్య చేశారనే విషయమై ఇంకా తేలాల్సి ఉంది.