ఏపీ సీఎం జగన్ ను కలిసిన పీవీ సింధు.. వైజాగ్ కేంద్రంగా అకాడమీ ఏర్పాటు.. ! (వీడియో)
ఒలింపిక్స్ లో పతకం సాధించి మన దేశ కీర్తి ప్రతిష్టలు ఎగరవేసిన సింధుకు జగన్ సర్కార్ 30 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. త్వరలో వైజాగ్ కేంద్రంగా క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా సహాకరిస్తానన్నారు. అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
టోక్యో ఒలంపిక్స్ లో అదరగొట్టిన తెలుగు తేజం పీవీ సింధు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. విజయవాడలోనూ ఆమెకు ఘన స్వాగతం పలికారు.
"
ఒలింపిక్స్ లో పతకం సాధించి మన దేశ కీర్తి ప్రతిష్టలు ఎగరవేసిన సింధుకు జగన్ సర్కార్ 30 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చింది. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. త్వరలో వైజాగ్ కేంద్రంగా క్రీడా అభివృద్ధికి అన్ని విధాలుగా సహాకరిస్తానన్నారు. అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.
అంతకు ముందు పివి సింధు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఒలింపిక్స్ లో సత్తా చాటిన సింధుకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సింధు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ఈఓ భ్రమరాంబ పివి సింధుకు అందించారు.
టోర్నమెంట్ కు వెళ్లేముందు అమ్మవారి దర్శనానికి వచ్చానని, పతకం సాధించిన మళ్లీ ఆలయానికి దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని సింధూ తెలిపింది. తాను ఇంకా టోర్నమెంట్లు ఆడాల్సి ఉందని, 2024లో కూడా ఒలింపిక్స్‌లో ఆడాలి. ఈసారి స్వర్ణం సాధించాలని అన్నారు.
కాగా, తెలుగు తేజం పీవీ సింధు టోక్యో ఒలంపిక్స్ లో అదరగొట్టింది. ఆమె కాంస్య పతకంతో హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. విజయవాడలోనూ ఆమెకు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో మంత్రి అవంతి శ్రీనివాస్.. పీవీ సింధుని కలిశారు.
ఈ సందర్భంగా సింధు.. మీడియాతో మాట్లాడారు. విజయవాడలో తనకు గ్రాండ్‌గా వెల్‌కమ్ లభించిందన్నారు. ఒలంపిక్స్ వెళ్లేముందు సీఎం జగన్ తనకు సపోర్ట్ చేశారని, అండగా ఉంటానని హామీ ఇచ్చారని పీవీ సింధు తెలిపారు. ఒలంపిక్స్‌లో పతకం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
ఒలంపిక్స్‌లో మెడల్ తీసుకురావడం ద్వారా గర్వంగా ఉందని చెప్పారు. కాంస్య పతకం పోరులో గెలిచిన తర్వాత రెండు నిమిషాలు బ్లాంక్ అయ్యానని పీవీ సింధు పేర్కొన్నారు. సెకండ్ టైమ్ ఒలంపిక్ మెడల్ దేశానికి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఇక్కడే జాబ్ చేస్తున్నానని, అభిమానం చూపిన వారందరికి ఒలింపిక్ పతకాన్ని అంకితమిస్తున్నట్లు పీవీ సింధు పేర్కొన్నారు.