కేసీఆర్, జగన్ లకు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్, జగన్ లకు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఏపీలో మళ్లీ అధికారం టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 150స్థానాలకుపైగా టీడీపీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సారి జగన్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని జోస్యం చెప్పారు.
మోదీ, జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్న కుట్రల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీసీలకు టీఆర్ఎస్ అడుగడుగునా అన్యాయం చేసినా నోరుమెదపని తలసాని శ్రీనివాస యాదవ్.. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు జగన్‌ను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబితాను తారుమారు చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు చంద్రబాబు పనితీరును విమర్శించడం ఏమిటని నిలదీశారు.కేసీఆర్, మోదీ ఎంత అండగా నిలిచినా... అవినీతిపరుడికి అధికారం కట్టబెట్టేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు.
