పూతలపట్టు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దయి వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,038 మంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం విభిన్న వాతావరణం వుంటుంది. తమిళనాడు సరిహద్దుకు అత్యంత చేరువలో వుండే ఈ నియోజకవర్గంలో మిక్స్‌డ్ కల్చర్ వుంటుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దయి వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెగ్మెంట్ పరిధిలో పూతలపట్టు, ఐరాల, తవనంపల్లె, బంగారుపాలెం, యాదమర్రి నియోజకవర్గాలున్నాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు.
పూతలపట్టు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. ఇప్పటి వరకు గెలవని టీడీపీ :
ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,038 మంది. వీరిలో పురుషులు 1,09,424 మంది.. మహిళలు 1,11,606 మంది. పూతలపట్టు సెగ్మెంట్ పరిధిలోని ఐదు మండలాల్లో మామిడి తోటలను రైతులను అధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి దేశవిదేశాలకు మామిడి కాయలు ఎగుమతి అవుతాయి. ఇక ఐరాల మండలంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వెలసిన కాణిపాకం ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వుంది. యాదవ, గాండ్ల, మొదలియార్, గౌండర్, ఎస్సీ సామాజికవర్గాలు పూతలపట్టులో బలంగా వున్నాయి.
2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్ తరపున పీ రవి ఎన్నికవ్వగా.. 2014లో వైసీపీ అభ్యర్ధి ఎం సునీల్ కుమార్.. 2019లో అదే పార్టీకి చెందిన ఎంఎస్ బాబులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఎంఎస్ బాబుకు 1,03,265 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఎల్ లలిత కుమారికి 74,102 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ 29,163 ఓట్ల తేడాతో రెండోసారి పూతలపట్టులో విజయం సాధించింది.
పూతలపట్టు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :
2024 ఎన్నికల విషయానికి వస్తే వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్‌కు జగన్ టికెట్ కేటాయించారు. టిడిపి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు.
- Aandhra pradesh assembly elections 2024
- Puthalapattu Assembly elections result 2024
- Puthalapattu Assembly elections result 2024 live updates
- Rajampet Assembly constituency
- ap assembly elections 2024
- bharatiya janata party
- chandrababu naidu
- congress
- janasena
- pawan kalyan
- tdp janasena alliance
- telugu desam party
- ys jagan
- ys jagan mohan reddy
- ys sharmila
- ysr congress party