Asianet News TeluguAsianet News Telugu

సుజనాను పక్కన పెట్టుకునే జైట్లీ చేశారు: బాబుపై పురంధేశ్వరి నిప్పులు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు అంగీకరించారని, ఇప్పుడేమో దొంగ దీక్షలు చేస్తున్నారని పురంధేశ్వరి విమర్శించారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని పక్కన పెట్టుకొనే అరుణ్‌ జైట్లీ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు.

Purandheswari lashes out at Chandrababu
Author
Vijayawada, First Published Feb 13, 2019, 7:47 AM IST

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్ష చేయడంపై బిజెపి జాతీయ నేత దగ్గుబాటి పురంధేశ్వరి నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంటుందని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు అంగీకరించారని, ఇప్పుడేమో దొంగ దీక్షలు చేస్తున్నారని పురంధేశ్వరి విమర్శించారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని పక్కన పెట్టుకొనే అరుణ్‌ జైట్లీ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం సవరించిన పోలవరం అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరికి ధన్యవాదాలు తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు ఇవ్వలేదని ఆరోపించారు.

 రైల్వే జోన్‌కు సంబంధించి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, జోన్‌ ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ప్రధానమంత్రి ఇస్తున్న ఇళ్లను, బీమా పథకాలను చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికై ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే..ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించలేదని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios