Asianet News TeluguAsianet News Telugu

మద్యం వ్య‌వ‌హారంలో వేల‌కోట్ల అక్రమాలు.. : జ‌గ‌న్ స‌ర్కారుపై పురంధేశ్వరి ఫైర్

Vijayawada: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తీరు ఏంటని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. మీడియా ఇంటరాక్షన్‌లో తన ఆందోళనను వ్యక్తం చేసిన ఆమె, అవినీతికి పాల్పడిన వారెవరైనా శిక్షించబడాలనీ, అయితే, అవినీతి జరిగిందో లేదో నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సీఐడీ విచారణ పూర్తి కావడం, చంద్రబాబును రిమాండ్‌కు పంపడంపై పురంధేశ్వరి సందేహాలు లేవనెత్తారు.
 

Purandeswari slams YS Jagan Mohan Reddy govt, demands inquiry into alleged irregularities in liquor issues RMA
Author
First Published Sep 19, 2023, 5:12 PM IST

AP BJP president Daggubati Purandeswari:  తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తీరు ఏంటని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. మీడియా ఇంటరాక్షన్‌లో తన ఆందోళనను వ్యక్తం చేసిన ఆమె, అవినీతికి పాల్పడిన వారెవరైనా శిక్షించబడాలనీ, అయితే, అవినీతి జరిగిందో లేదో నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. సీఐడీ విచారణ పూర్తి కావడం, చంద్రబాబును రిమాండ్‌కు పంపడంపై పురంధేశ్వరి అనుమానాలు వ్యక్తం చేశారు.

అలాగే, మద్యం పరిశ్రమలో వేల కోట్ల అవినీతి జరుగుతోందని సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గత యజమానుల నుంచి మద్యం కంపెనీలను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకునీ, పేర్లు మార్చి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని పురందేశ్వరి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం తయారీలో వాడే హానికారక పదార్థాలను, అధిక ధరలకు మద్యం అమ్మడం వల్ల ప్రజల శ్రేయస్సు దెబ్బతింటుందనీ, కుటుంబాలు చితికిపోతున్నాయని విమర్శించారు.

నాసిరకం మద్యం సేవించడం వల్ల జరిగిన మరణాలపై సీబీఐ విచారణ జరిపించాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.సీఎం జగన్ చేసిన మోసాలను బయటపెడతామని హామీ ఇచ్చారు. మద్యం పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పారదర్శకత పాటించాలని, నిధుల కేటాయింపుపై ప్రశ్నించారు. మహిళలు ఈ విషయాలపై ఆలోచించాలనీ, ఇలాంటి ఆచారాల వల్ల సమాజంపై కలిగే ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలని పురందేశ్వరి కోరారు.

రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా ఉందనీ, రోజువారీ ఆదాయం రూ.160 కోట్లు, నెలవారీ ఆదాయం రూ.4,800 కోట్లు, మద్యం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం రూ.56,700 కోట్లుగా అంచనా వేస్తూ.. మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని బడ్జెట్ లో కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే చూపుతున్నారని, రూ.36,700 కోట్ల వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios