పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విశాఖ పర్యటనకు వచ్చారు. నాలుగు రోజుల పాటు జరిగే మెడిటేషన్ కోర్స్ కోసం ఆయన నగరానికి చేరుకున్నారు. నగరంలోని బీచ్ రోడ్‌లో వున్న ప్రముఖ వెల్ నెస్ సెంటర్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ విశాఖ పర్యటనకు వచ్చారు. నాలుగు రోజుల పాటు జరిగే మెడిటేషన్ కోర్స్ కోసం ఆయన నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్.. పంజాబ్ సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరవాడ మండలంలో వున్న విశాఖ ఫార్మసీ కంపెనీలో భగవంత్ మాన్ పర్యటించారు. రాంకీ ఫార్మాను సందర్శించి ఫార్మా సంస్థల ఏర్పాటు, కాలుష్య నియంత్రణకు సంబంధించిన చర్యలు, ఉత్పత్తులు, ఎగుమతుల వంటి అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రంలోనూ పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రదేశాలు వున్నాయని.. తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పారిశ్రామికవేత్తలు తరలిరావాలని భగవంత్ మాన్ కోరారు.
కాగా.. నగరంలోని బీచ్ రోడ్‌లో వున్న ప్రముఖ వెల్ నెస్ సెంటర్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వుంది. సముద్ర తీరంలో ఎత్తైన కొండపై ఆహ్లాదకరంగా, విలాసవంతమైన సౌకర్యాలతో ఈ వెల్‌నెస్ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ పలు శారీరక, మానసిక రుగ్మతలకు ప్రకృతి వైద్యాన్ని అందిస్తూ వుంటారు. ఈ వెల్‌నెస్ కేంద్రానికి ప్రతి నిత్యం దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు విచ్చేస్తూ వుంటారట. ఇక్కడ చికిత్స తీసుకుని మానసికంగా ఉల్లాసాన్ని పొందుతూ వుంటారు. మెంటల్‌గా బలంగా వుండేలా ఈ వెల్ నెస్ కేంద్రంలో మెడిటేషన్‌తో ప్రకృతి వైద్యాన్ని అందిస్తారట.
